మూడు చెరువుల నీళ్లు తాగిస్తోన్న షిండే- చెప్పా పెట్టకుండా అవుట్..!!

New Maharashtra CM: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తోన్నప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది తేలట్లేదు. ముఖ్యమంత్రి పీఠంపై పీటముడి పడింది. ప్రతిష్ఠంభన కొనసాగుతూనే వస్తోంది. మహారాష్ట్రతో పాటే ఎన్నికలను ఎదుర్కొన్న జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇక్కడ మాత్రం జాప్యం జరుగుతోంది.

సీఎం కుర్చీ కోసం పట్టిన పట్టు..

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఎలాంటి స్పష్టతా రావాట్లేదు. భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తోంది. వరుసగా రెండోసారి ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ శివసేన పట్టుబట్టడం దీనికి ప్రధాన కారణం.

New Maharashtra CM Mahayuti meet called off as CM Eknath Shinde left for Satara

కూటమి లెక్కలివీ..

సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సీట్ల సంఖ్యా బలం బీజేపీకి లేదు. 149 సీట్లల్లో పోటీ చేసి 132 చోట్ల గెలిచిందీ పార్టీ. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి.

ఫడ్నవిస్‌కే పట్టం..

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిత్రపార్టీల మద్దతు తప్పనసరి కావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన భీష్మించింది. బీజేపీ అధిష్ఠానం మాత్రం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ వైపే మొగ్గు చూపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా సీఎం పదవి తమ పార్టీకే దక్కాలనే పట్టుదలతో ఉంది బీజేపీ.

అమిత్ షా చర్చలు..

ఈ పరిస్థితుల మధ్య బీజేపీ అధిష్ఠానం ముఖ్యమంత్ర అభ్యర్థి ఖరారుపై ఈ ముగ్గురు నేతలు- ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌లను ఢిల్లీకి పిలిపించుకుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గురువారం అర్ధరాత్రి వరకూ ఈ చర్చలు సాగాయి.

New Maharashtra CM Mahayuti meet called off as CM Eknath Shinde left for Satara

స్వగ్రామానికి ప్రయాణం..

అంతా సవ్యంగా సాగుతోందనుకుంటోన్న ఈ దశలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మరోసారి బీజేపీకి షాకిచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఇంకాస్సేపట్లో జరగాల్సిన మహాయుటి కూటమి భేటీకి దూరం అయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఫలితంగా ఈ సమావేశం రద్దయింది.

ససేమిరా..

ఇంకాస్సేపట్లో మహాయుటి భేటీ జరగాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నట్టుండి షిండే తన స్వగ్రామానికి ప్రయాణం కట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవడానికి ఆయన ఎంత మాత్రం కూడా సుముఖంగా లేరనే విషయం దీనితో మరోమారు స్పష్టమైనట్టయింది.

డిప్యూటీ హోదాపై వ్యతిరేకత..

ముఖ్యమంత్రి ఫడ్నవిస్ సారథ్యంలో ఏర్పడబోయే మహాయుటి సర్కార్‌లో ఉప ముఖ్యమంత్రి హోదాలో పని చేయడానికి షిండే ఇష్టపడట్లేదని, తామెవ్వరం కూడా అందుకు అంగీకరించట్లేదని శివసేన శాసన సభ్యుడు సంజయ్ శిర్సత్ తేల్చి చెప్పారు. సీఎంగా మినహా మరే పదవిని కోరుకోవట్లేదని స్పష్టం చేశారు.

హోం సైతం బీజేపీకే..

అమిత్ షా వద్ద జరిగిన భేటీలో కీలకమైన హోం మంత్రిత్వ శాఖపై కూడా ఎలాంటి హామీ లభించలేదు షిండేకు. ఈ పోర్ట్ ఫోలియో కూడా తమ వద్దే ఉంటుందని తేల్చి చెప్పారాయన. కావాలంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తామని, అజిత్ పవార్‌కు ఆర్థిక శాఖ కేటాయిస్తామని వివరించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+