ఐఏఎస్ డికే. రవి స్థానంలో మాన్వి నియామకం
బెంగళూరు: బెంగళూరు వాణిజ్య పన్నుల శాఖ విభాగం జాయింట్ డైరెక్టర్ గా ఐఏఎస్ అధికారి ఎస్.ఎ. మాన్విని నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. ఎస్.ఎ. మాన్వి భాద్యతలు స్వీకరించి విధులలో నిమగ్నం అయ్యారు.
బెంగళూరు వాణిజ్య పన్నుల శాఖ విభాగం జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి డి.కే. రవి గత నెల 16వ తేదిన అనుమానాస్పదస్థితిలో మరణించారు. అప్పటి నుండి ఆయన కుర్చి ఖాళీగా ఉంది. అత్యంత కీలకమైన ఈ పదవిలో ఎవరిని నియమించాలనే విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగానే ఆలోచించారు.

చివరికి ఐఏఎస్ అధికారి మాన్విని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. మాన్వి పూర్తిగా ఇదే పదవిలో కొనసాగుతారా, లేక తాత్కాలికంగా ఆమెను నియమించారా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు.
కొంత కాలం మాన్వి పని తీరును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత సరైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భావిస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications