రైలు ప్రయాణికులకు కొత్త రూల్స్ .. ఉల్లంఘిస్తే అంతే!!
ప్రతిరోజు మిలియన్ల మంది ప్రయాణికులు రైళ్ళలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇండియన్ రైల్వే ప్రయాణికులకు రైళ్లలో కావలసిన సౌకర్యాలను కల్పించడంతోపాటు, వారి ప్రయాణం సాఫీగా సాగడానికి కావలసిన అనేక చర్యలను చేపడుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణం చేసేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం రైల్వే కొత్త రూల్స్ పెట్టింది.
రాత్రిపూట రైలు ప్రయాణం చేసే వారికి ఇతర ప్రయాణికులతో ఇబ్బంది కలుగుతుందని ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో రైల్వే అధికారులు కొత్త రూల్స్ పెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు రాత్రివేళ తమ ప్రయాణ సమయంలో ప్రశాంతంగా నిద్రపోవడానికి కొన్ని రాత్రిపూట ఉన్న నిబంధనలను రైల్వే శాఖ అప్డేట్ చేసింది.

చాలామంది పక్క వాళ్ళు పడుకున్నారు అన్న ఇంగితం కూడా లేకుండా లౌడ్ స్పీకర్ లలో మొబైల్ ఫోన్లలో సినిమాలు, పాటలు పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాదు పక్క వాళ్ళతో సంబంధం లేకుండా పెద్దగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. రాత్రిపూట పడుకోనివ్వకుండా లైట్లు వేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇటువంటి వారు తమ పద్ధతి మార్చుకోవాలని తాజాగా అప్డేట్ చేసిన నియమాలతో స్పష్టంగా చెప్పింది రైల్వే శాఖ.
లౌడ్ స్పీకర్ లో రాత్రిపూట పాటలు ప్లే చేయడాన్ని నిషేధించింది. ఒకవేళ ఎవరైనా మొబైల్ ఫోన్లో ఏదైనా చూడాలన్నా, వినాలన్నా ఇయర్ ఫోన్ లను ఉపయోగించాలని సూచించింది. రైల్వే కంపార్ట్మెంట్ లో రాత్రి సమయంలో ఫోన్లో బిగ్గరగా మాట్లాడడాన్ని కూడా నిషేధించింది. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికులు లైట్లు ఆన్ చేయడానికి వీలు లేదని పేర్కొంది.
రాత్రిపూట ప్రయాణం చేసే ప్రయాణీకులు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాలని, విఫలమైతే జరిమానాలు విధిస్తారని రైల్వే శాఖ పేర్కొంది. ఇక రాత్రిపూట రైళ్ళలో ప్రయాణం చేసేటప్పుడు ఈ నిబంధనలను ప్రయాణికులు పాటిస్తున్నారా లేదా అన్నది టిటిఈ మరియు రైల్వే సిబ్బంది పర్యవేక్షిస్తారని పేర్కొంది. రాత్రిపూట ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా అసౌకర్యం కలిగితే ప్రయాణికులు టీటీఈతో మాట్లాడవచ్చని, ఫిర్యాదు చేయవచ్చని రైల్వే శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications