వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో 9 మందికి కరోనా స్ట్రెయిన్.. 38 మందికి చేరిన సంఖ్య: కేంద్ర ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో 9 మందికి స్ట్రెయిన్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటివరకు దీని బారినపడినవారి సంఖ్య 38కి చేరింది. కేరళలో తొలిసారి ఆరుగురికి స్ట్రెయిన్‌ సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒకే కుటుంబంలోని ఐదుగురికి నిర్ధారణ అయింది. వీరిలో రెండేళ్ల చిన్నారి ఉండటం విశేషం.

Recommended Video

#Strainvirus In Telangana : Warangal లో కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్‌ కలకలం.. ఆ 156 మంది ఎక్కడ..?
 new strain another 9 people: central government

దేశంలో వరుసగా మూడో రోజు కరోనా కేసులు 20 వేలలోపే నమోదయ్యాయి. ఆదివారం 16,504 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 214 మంది చనిపోయారు. 187 రోజుల అత్యల్ప సంఖ్యలో.. గత నెల 29న 16,432 కేసులు రాగా, ఆ తర్వాత ఇవే అత్యల్పంగా కేసులు వచ్చాయి. కొత్తగా 19,557 మంది కోలుకున్నారు. దీంతో యాక్టివ్‌ కేసులు 3,267 మేర తగ్గి 2,43,953కు పరిమితమయ్యాయి.

చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. శనివారం గ్రాండ్‌ చోలా హోటల్‌ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు సహా 85 మందికి వైరస్‌ నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అన్ని హోటళ్లలో పరీక్షలకు ఆదేశించింది. దీంతో 6,416 మంది సిబ్బందిలో సోమవారం వరకు 4,392 మందికి టెస్టులు నిర్వహించారు. వీరిలో 125 మందికి పాజిటివ్‌గా తేలింది. 491 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

English summary
new strain another 9 people central government said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X