మోడీ కొత్త వ్యాక్సిన్ల ప్లాన్- కేంద్రంపై రూ.50 వేల కోట్ల భారం- ఆర్ధికశాఖ అంచనా
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వ్యాక్సిన్ల భారం మోపడంపై ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నిన్న కీలక ప్రకటన చేశారు. వ్యాక్సిన్ల భారాన్నితామే మోస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రాలకు ఊరట లభించినట్లయింది. అయితే దీని వల్ల తమపై రూ.50 వేల కోట్ల భారం పడుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ నిధులకు లోటేమీ లేదని కేంద్ర ఆర్ధికశాఖ ఇవాళ ప్రకటించింది.
Recommended Video
రాష్ట్రాలపై మోపిన వ్యాక్సిన్ల భారాన్ని తాము తీసుకునేందుకు సిద్ధమైన నేపథ్యంలో కేంద్రంపై పడే భారానికి తగినట్లుగా నిధుల లభ్యత ఉందని ఆర్ధికశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికిప్పుడు అదనపు నిధుల కోసం గ్రాంట్లకు వెళ్లాల్సిన అవసరం లేదని, పార్లమెంటు శీతాకాల సమావేశాల సమయంలో మరోసారి నిధులు కేటాయిస్తామని తెలిపింది. కేంద్రం విదేశీ వ్యాక్సిన్ల కోసం ఎదురుచూడడం లేదని, దేశీయంగా ఉత్పత్తి పెంచుకునేందుకే ప్రయత్నిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

భారత్ బయోటెక్, సీరం, బయో-ఈ సంస్ధలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లతోనే భారత్‌లోని దాదాపు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్న ధీమా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫైజర్, మోడర్నాతో వ్యాక్సిన్ల కొనుగోలు చర్చలు పరిహారం వద్దే ఆగిపోయాయని, ఆయా సంస్ధలు వివాదాల్ని భారత్‌లో కాకుండా అమెరికా కోర్టుల్లో తేల్చుకుంటామని చెప్తున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తాజా అంచనాల ప్రకారం మోడర్నా సంస్ధ వచ్చే జనవరి వరకూ భారత్‌కు వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశం లేదన్నాయి.
ప్రస్తుతం భారత్‌లో మూడు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చినా అందులో స్పుత్నిక్ డోసులు ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి రావడం కష్టమేనని తెలిపాయి. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ సంస్ధ వ్యాక్సిన్లను 30 కోట్ల డోసులు తీసుకునేందుకు కేంద్రం రూ.1500 కోట్లు అడ్వాన్స్‌లు కూడా చెల్లించిందన్నారు. ఇది అందుబాటులోకి వస్తే కోవాగ్జిన్ తర్వాత రెండో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కానుంది.












Click it and Unblock the Notifications