కాస్త కేసుల ఉధృతి తగ్గినా కొత్త వేరియంట్ టెన్షన్ ; భారత్ లో తాజా కరోనా పరిస్థితి ఇదే !!

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసుల హెచ్చుతగ్గులతో కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు 40 వేలకు పైగా ఉన్న కరోనా కేసులు, ఇప్పుడు 30 వేలకు చేరుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 30,941 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన కరోనా కేసుల కంటే ఈరోజు నమోదైన కరోనా కేసులు 27.9% తక్కువ. యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1.13 శాతంగా ఉన్నాయి. భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసులు 3,70,640 వద్ద ఉన్నాయి.

దేశంలో మరణించిన వారి సంఖ్య 4,38,560
గత 24 గంటల్లో భారత దేశంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 350 గా నమోదయింది. దీంతో ఇప్పటివరకు మొత్తంగా దేశంలో మరణించిన వారి సంఖ్య 4,38,560 గా నమోదయింది. ఇదిలా ఉంటే గతేడాది కరోనా మహమ్మారి దేశంలో మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు 3.27 కోట్ల మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం దేశంలో 3.19 కోట్ల మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో 36, 275 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. దీంతో మొత్తంగా దేశంలో రికవరీ రేటు 97.53 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే కేరళ రాష్ట్రంలో 19వేల కేసులు నమోదయ్యాయి. దేశంలో మిగిలిన ప్రాంతాలలో 11 వేల కేసులు నమోదు కాగా, కేరళ లో కరోనా పరిస్థితి అక్కడ తీవ్రతకు అద్దం పడుతోంది.

New variant tension while slightly calming cases; This is the latest corona situation in India !!

కొత్త కరోనా వేరియంట్ C.1.2 స్ట్రెయిన్ టెన్షన్
కొత్త కరోనావైరస్ వేరియంట్ C.1.2 స్ట్రెయిన్ మేలో దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించబడింది. ఇప్పటివరకు ఆరు దేశాలలో కొత్త కరోనా వేరియంట్ C.1.2 స్ట్రెయిన్ ఇప్పటివరకు ఆరు దేశాలలో వ్యాపించింది.ఇప్పుడు ఈ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది.నివేదికల ప్రకారం, మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచం సాగిస్తున్న పోరాటం మధ్య మరో కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తుంది. వైరస్‌లోని ఉత్పరివర్తనల కారణంగా అవి యాంటీబాడీలను నుండి తప్పించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూడవ వేవ్ ప్రారంభ సంకేతంగా తాజా కేసుల ధోరణి
భారతదేశ అగ్రశ్రేణి వైద్య సంస్థ ఐసిఎంఆర్ యొక్క ఎపిడెమియాలజీ మరియు కమ్యూనికబుల్ డిసీజెస్ హెడ్ సోమవారం, కోవిడ్-19 మహమ్మారి యొక్క తీవ్రమైన రెండవ తరంగాన్ని ఎదుర్కొన్న రాష్ట్రాలు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల ధోరణితో ఉన్నాయని, ఇది మూడవ వేవ్ ప్రారంభ సంకేతాలను చూపుతోందని చెప్పారు . రాష్ట్రాలు కోవిడ్ -19 ఆంక్షలు పాటించడం, టీకాలు పెంచడం వల్ల కాస్త కరోనా మూడవ తరంగ ప్రభావం కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

కేరళలో 19,622 తాజా కేసులు, వ్యాక్సినేషన్ ఇలా
గత 24 గంటల్లో, కేరళలో 19,622 తాజా కేసులు నమోదయ్యాయి, గత 24 గంటల్లో కేరళ రాష్ట్రం నమోదు చేసిన అత్యధిక రోజువారీ పెరుగుదల భారతదేశానికి ప్రధాన ఆందోళనగా మారింది.దేశ రాజధానిలో రోజువారీ కేసుల తగ్గుదల కనిపిస్తున్నందున ఢిల్లీలోని పాఠశాలలు 9 నుండి 12 వ తరగతి వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సరం చివరినాటికి 108 కోట్ల మంది పెద్దలకు టీకాలు వేయాలనే లక్ష్యాన్ని ఛేదించే సమయంలో భారతదేశం ఇప్పటివరకు 64 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. దేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 2.51 శాతంగా నమోదైంది - గత 67 రోజులుగా ఇది 3 శాతం కంటే తక్కువగా ఉంది.

ప్రపంచంలో కరోన కేసులలో ప్రధమస్థానం యూఎస్, సెకండ్ ప్లేస్ భారత్
డిసెంబర్ నాటికి యూరప్‌లో కోవిడ్‌తో 2,36,000 మంది మరణించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం హెచ్చరించింది. ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది కోవిడ్ -19 టీకాల కోసం ప్రాధాన్యతనిచ్చే సమూహాలలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. తద్వారా యూరప్ మరియు మధ్య ఆసియాలోని స్కూల్స్ తెరచినప్పటికీ పెద్దగా కరోనా ప్రమాదం ఉండబోదని భావిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనాకేసులలో యూఎస్ మొదటి స్థానంలో ఉంది. యూఎస్ లో అత్యధిక సంఖ్యలో 3,90,57,368 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో ఉన్న భారతదేశంలో 3,27,68,880 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా, ఇప్పటివరకు 45 లక్షల మంది మరణించారు. 21 కోట్ల మందికి పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+