సెప్టెంబర్ 1 నుంచి కొనుగోలు చేసే కొత్త వాహనాలకు రూ.24వేల బీమా చెల్లించాలి
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా కొనుగోలు చేస్తున్న వాహనాలకు ఒకేసారి మూడు నుంచి ఐదేళ్లవరకు బీమా సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు ఇన్ష్యూరెన్స్ కంపెనీలకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1 నుంచి కొనుగోలు చేసే కార్లకు ఐదేళ్ల పాటు ఇన్ష్యూరెన్స్, మోటార్ బైకులకు మూడేళ్లపాటు ఇన్ష్యూరెన్స్ కల్పిస్తామని బీమా సంస్థలు తెలిపాయి. ఇది అమల్లోకి వస్తే కారు కొనుగోలు చేసేవారు రూ.24వేలు, మోటార్ బైకులు కొనేవారు రూ.13వేలు ఇన్ష్యూరెన్స్ కోసం కట్టాల్సి ఉంటుంది.
సుప్రీం కోర్టు చెప్పినట్లుగానే వచ్చే నెల నుంచి కొత్త బీమా పద్ధతిని అమలు చేయాలని థర్డ్ పార్టీ ఇన్ష్యూరెన్స్ కంపెనీలకు ఇన్ష్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్‌డీఏ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి ఇన్ష్యూరెన్స్ సంస్థలు దీర్ఘకాల పద్దతిలో అంటే ఐదేళ్లకు గానీ మూడేళ్లకు గానీ బీమా కల్పిస్తాయి. ఒక వేళ బీమా కలిగిన వాహనం ప్రమాదానికి గురై ఆ వాహనం కారణంగా ఎవరికైనా గాయాలు కానీ, మరణం కానీ సంభవిస్తే అట్టి థర్డ్ పార్టీ వారికి కూడా ఇన్ష్యూరెన్స్ సంస్థలు బీమా చెల్లిస్తాయి.

జూలై 20,2018న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో థర్డ్ పార్టీ వారికి కూడా ఇన్ష్యూరెన్స్ ఇవ్వాలని బీమా సంస్థలను కోరింది. అంతకుముందు ఒక్క సంవత్సరం మాత్రమే థర్డ్ పార్టీకి బీమా కల్పించేది. థర్డ్ పార్టీ ఇన్ష్యేరెన్స్ కొత్త రేట్లు సెప్టెంబర్ 1,2018 నుంచి మార్చి 31,2019 మధ్య కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి అమలు అవుతుంది. వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే మొత్తం మూడేళ్లకుగానీ ఐదేళ్లకుగానీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏడాది లెక్కనే దాన్ని గుర్తిస్తారు. వాహనం మరొకరికి అమ్మితేనే వాహన యజమానిపై ఉన్న థర్డ్ పార్టీ ఇన్ష్యూరెన్స్ రద్దు చేసి...కొత్త యజమానికి బదిలీ చేయాల్సి ఉంటుంది.
ప్రీమియం రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రైవేట్ కార్లకు మూడేళ్ల ప్రీమియం రేట్లు
1000సీసీ మించకుండా ఉండే వాహనంకు: రూ.5,286/-
1000సీసీ నుంచి 1500సీసీ మధ్య ఉండే వాహనం: రూ.9,534
1500 సీసీకి మించి వాహనం ఉంటే: రూ. 24,305
ద్విచక్ర వాహనాలు:
ఐదేళ్ల ప్రీమియం రేట్లు
75 సీసీ మించకుండా ఉండే బైకు: రూ.1,045
75సీసీ నుంచి 150 సీసీ మధ్య ఉండే బైకు: రూ. 3,285
150 సీసీ నుంచి 350 సీసీ మధ్య ఉండే బైకు: రూ. 5453
350 సీసీకి మించి ఉండే బైకు: రూ.13,034
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications