Wife: కొంపలో న్యూఇయర్ పార్టీ, భార్యను చంపేసి శవం పక్కన నిద్రపోయిన భర్త, ఏం జరిగిందంటే ?
చెన్నై: వివాహం చేసుకున్న తరువాత సంతోషంగా కాపురం చేసిన నందకుమార్, బబిత దంపతులకు 9 ఏళ్ల కుమార్తె, 7 ఏళ్ల కుమారుడు ఉన్నారు. పిల్లలతో కలిసి దంపతులు హ్యాపీగా తిరుగుతున్నారు. అత్తారింటికి వెలుతున్న అల్లుడు భార్య కుటుంబ సభ్యులు, బంధువులతో చాలా సరదగా ఉండేవాడు. న్యూఇయర్ సందర్బంగా భర్త అతని భార్యను రెండు రోజులు పుట్టింటికి పంపించాడు. తరువాత భర్త ఇంటికి వెళ్లిన భార్య రగిలిపోయింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన భర్త అతని భార్యను చంపేసి ఆమె శవం పక్కనే నిద్రపోయాడు.

చెన్నై సిటీలో ఫ్యామిలీ
చెన్నైలోని తాండయార్‌పేటలోని కరుణానిధి నగర్ ప్రాంతంలో నందకుమార్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మనాలికి చెందిన బబిత(30) అనే యువతిని నందకుమార్ 10 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత సంతోషంగా కాపురం చేసిన నందకుమార్, బబిత దంపతులకు 9 ఏళ్ల కుమార్తె, 7 ఏళ్ల కుమారుడు ఉన్నారు.

ఇంట్లో ఫ్రెండ్స్ కు న్యూఇయర్ పార్టీ
నందకుమార్ అతని ఫ్రెండ్స్ తో కలిసి న్యూఇయర్ పార్టీ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నందకుమార్ అతని భార్య బబిత, పిల్లలను మనాలిలోని ఆమె పుట్టింటికి వెళ్లి రెండు రోజులు అక్కడే ఉండిరావాలని చెప్పాడు. డిసెంబర్ 31వ తేదీన బబిత ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె తండ్రి ఇంటికి వెళ్లింది. అదే రోజు రాత్రి నందకుమార్ తాండయార్‌పేటలోని తన ఇంటిలో స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాడు.

మరుసటి రోజే వచ్చేసిన భార్య
రాత్రి నందకుమార్ అతని ఫ్రెండ్స్ విపరీతంగా మద్యం, బీర్లు తాగేసి చికెన్ కబాబ్, మటన్ బిరియానీలు తినేసి ఎక్కడ ప్యాకెట్లు అక్కడే, ఎక్కడ బాటిల్స్ అక్కడే వదిలేసి నిద్రపోయారు. నందకుమార్ లెక్క ప్రకారం అతని భార్య బబిత జనవరి రెండో తేదీన ఇంటికి రావాలి, అయితే పుట్టింటికి వెళ్లిన బబిత మరుసటి రోజు జనవరి 1వ తేదీన బబిత ఆమె ఇంటికి వెళ్లింది. ఇంటికి వచ్చి చూడగా ఈ ఇల్లు ఇల్లుగా లేదని, ఇంటిని నాశనం పట్టించావని, కొంపలో మందు పార్టీ ఇస్తావా ? అంటూ బబిత ఆమె భర్త నందకుమార్ పై ఆగ్రహంతో ఊగిపోయింది.

భార్య గొంతు బిగించి పక్కనే నిద్రపోయాడు
ఇంటిలో ఎక్కడ చూసిన మద్యం సీసాలు, బిరియానీ ఖాలీ ప్యాకెట్లు కనపడటంతో బబిత రగిలిపోయింది, ఇదే వియంలో బబిత ఆమె భర్త నందకుమార్ తో గొడవకు దిగింది. ఆ సందర్బంలో నందకుమార్, బబిత దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన నందకుమార్ అతని భార్య బబిత గొంతును చీరతో బిగించి హత్య చేసి ఆమెను పరుపుపైకి నెట్టేసి అదే మంచం మీద మద్యం మత్తులో నిద్రపోయాడు.

రాత్రి ఏం జరిగిందంటే ?
నందకుమార్ పిల్లలు ఇద్దరు తల్లి బబితను నిద్రలేపారు. చలనంలేకుండా బబిత అలాగే పడి ఉండటంతో స్థానికులు, పిల్లలు ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ బబిత పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. బబిత మెడపై గాయాలు, గొంతు కోసిన ఆనవాళ్లు కనిపించడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.

భర్త ఏం చెప్పాడంటే ?
చెన్నై ఆర్కే నగర్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని నందకుమార్ ను విచారించారు. రాత్రి ఇంట్లో జరిగిన విషయాన్ని నందకుమార్ పోలీసులకు చెప్పి అతని భార్య బబితను హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు నందకుమార్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. న్యూ ఇయర్ వేడుకల్లో సమయంలో మైమరచిపోయి ఇంట్లో మద్యం సేవించారని మందలించిన భార్యను ఆమె భర్త హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications