కల్లోల కరోనా..అదే స్పీడ్: అరలక్షకు తగ్గకుండా: మరింత భీతావహంగా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి మరింత పెరిగింది. కొద్దిరోజులుగా వరుసగా 50 వేల మార్క్‌ను అధిగమించేలా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అదే దూకుడును, అదే స్పీడును కొనసాగిస్తోంది కరోనా మహమ్మారి. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు పరంపరలో ఏ మాత్రం మార్పు కనిపించట్లేదు. మరణాల సంఖ్యలోనూ తగ్గుదల కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 52,050 కేసులు వెలుగులోకి వచ్చాయి. 803 మంది మరణించారు.

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 18 లక్షలను దాటింది. ఇప్పటిదాకా 18,55,746 కేసులు నమోదు అయ్యాయి. 38,938 మంది మరణించారు. డిశ్చార్జి అయిన వారి సంఖ్య సైతం భారీగా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. దేశవ్యాప్తంగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 12,30,510 లక్షలకు చేరువైంది. వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,86,298 గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే తాజా బులెటిన్‌ను విడుదల చేసింది.

Newly 52,972 Covid 19 positive cases and 803 deaths have reported in India past 24 hours

కాాగా- దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి బుధవారం వరకు మొత్తం రెండు కోట్ల మార్క్‌ను దాటింది. ఇప్పటిదాకా 2,08,64,750 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 6,61,182 మంది నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. రోజువారీ కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పెద్దసంఖ్యలో కరోనా వైరస్ నమూనాలను పరీక్షిస్తున్నట్లు తెలిపారు.

దేశ రాజధాని, తెలంగాణల్లో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల్లో కొద్దిగా తగ్గుముఖం కనిపించింది. ఇదివరకటి సంఖ్యతో పోల్చుకుంటే.. కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతోన్న కేసుల్లో చెప్పుకోదగ్గ తగ్గుదల నమోదవుతోంది. అదే సమయంలో ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కరోనా తన కల్లోలాన్ని కొనసాగిస్తూనే వస్తోంది. మహారాష్ట్రలో 4,50,196 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 1,47,018గా నమోదు అయ్యాయి. 2,87,030 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. 15,842 మంది మరణించారు. ఇవే తరహా పరిస్థితులు ఏపీలోనూ నెలకొన్నాయి.

Recommended Video

    టార్గెట్ కర్ణాటక, కేరళ.. United Nations హెచ్చరిక || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+