Lockdown: లాక్ డౌన్ తో 40 రోజులు ఇంట్లోనే, నవ దంపతులు ఆత్మహత్య, బెంగళూరులో బతకాలని ఆశ !

బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో బతకాలని ఆశతో బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన నవ దంపతులు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారు. లాక్ డౌన్ సందర్బంగా దాదాపు 40 రోజులు పాటు ఇంటికే పరిమితం అయిన నవదంపతులు చివరికి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు హడలిపోయారు. ఇంటి యజమాని కరెంట్ బిల్లు స్లిప్ ఇవ్వడానికి వెళ్లిన సమయంలో నవ దంపతులు ఆత్మహత్య చేసుకుని శవమై కనించారు.

బీహార్ టూ బెంగళూరు

బీహార్ టూ బెంగళూరు

బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ (30), రాణి (26) అనే యువతి యువకుడికి ఐదు నెలల క్రితం వివాహం అయ్యింది. నాలుగు నెలల క్రితం బెంగళూరు చేరుకున్న రాహుల్, రాణి దంపతులు మెజస్టిక్ సమీపంలోని శ్రీరాంపుర ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు.

 బెంగళూరులో స్థిరపడాలని !

బెంగళూరులో స్థిరపడాలని !

బీహార్ కు చెందిన రాహుల్, రాణి బెంగళూరు చేరుకుని ఇక్కడే మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడాలని నిర్ణయించారని తెలిసింది. బెంగళూరులో మంచి ఉద్యోగాలు సంపాధించడానికి రాహుల్, రాణి ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు వచ్చిన మొదట్లో రాహుల్, రాణి దంపతులు చాలా సంతోషంగా ఉన్నారని వారి ఇంటి చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు చెబుతున్నారు.

 కరెంట్ బిల్లు కోసం వెళ్లిన యజమాని !

కరెంట్ బిల్లు కోసం వెళ్లిన యజమాని !

రాహుల్, రాణి దంపతులు నివాసం ఉంటున్న అద్దె ఇంటికి కరెంట్ బిల్లు వచ్చింది. కరెంట్ బిల్లు స్లిప్ ఇవ్వడానికి ఇంటి యజమానికి వారి ఇంటి దగ్గరకు వెళ్లి తలుపుకొట్టారు. ఎంత సేపు పిలిచినా రాహుల్, రాణి మాట్లాడకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి కిటికీలో చూడగా వారు ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.

 40 రోజులుగా లాక్ డౌన్ తో ఇంట్లోనే !

40 రోజులుగా లాక్ డౌన్ తో ఇంట్లోనే !

లాక్ డౌన్ అమలు కావడంతో గత 40 రోజుల నుంచి నవ దంపతులు రాహుల్, రాణి ఇంటికే పరిమితం అయ్యారు. ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఉండే రాహుల్, రాణి ఆత్మహత్య చేసుకోవడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు హడలిపోయారు. రాణి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని, రాహుల్ విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీరాంపుర పోలీసులు అంటున్నారు. అయితే నవ దంపతులు రాహుల్, రాణి ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు మాత్రం తెలియడం లేదని శ్రీరాంపుర పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+