వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశాల్లో భర్త ఉద్యోగం: ప్రియుడికి ఫోన్, నగదుతో నవవధువు ఎస్కేప్!

|
Google Oneindia TeluguNews

లక్నో: భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తు్నాడు. రెండు నెలల నుంచి నవవధువు ఒంటరిగా ఉంటున్నది. ఒంటి మీద కొత్తగా తయారు చేయించిన బంగారు నగలు ఉన్నాయి. ఇంటిలోని బీరువాలో డబ్బులు ఉన్నాయి. అంతే మాస్టర్ ప్లాన్ వేసి ప్రియుడిని ఇంటికి పిలిపింపింది.

ఘనంగా పెళ్లి

ఘనంగా పెళ్లి

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నాప్ జిల్లాలోని సరాయా గ్రామంలో నివాసం ఉంటున్న అమర్ సింగ్ యాదవ్, సునీతల వివాహం 2017 మార్చి లో జరిగింది. 7 నెలల పాటు అమర్ సింగ్ యాదవ్, సునీత దంపతులు సంతోషంగా ఉన్నారు.

 విదేశాల్లో ఉద్యోగం

విదేశాల్లో ఉద్యోగం

రెండు నెలల క్రితం ఉద్యోగం చెయ్యడానికి అమర్ సింగ్ యాదవ్ విదేశాలకు వెళ్లాడు. పెళ్లి సందర్బంగా సునీతకు పుట్టింటి వాళ్లు బంగారు నగలు ఎక్కువ చేయించి ఇచ్చారు. పెళ్లికి ముందే సునీత దుర్గా యాదవ్ అనే యువకుడిని ప్రేమించింది.

 మంచి చాన్స్ కోసం చూసింది

మంచి చాన్స్ కోసం చూసింది

భర్త అమర్ సింగ్ యాదవ్ విదేశాలకు వెళ్లినప్పటి నుంచి సునీత మంచి చాన్స్ కోసం ఎదురు చూసింది. శుక్రవారం అత్తగారి ఇంటిలో ఎవరు లేని సమయంలో ఇదే మంచి చాన్స్ అంటూ సునీత ప్రియుడు దర్గా యాదవ్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది.

 ప్రియుడితో జంప్

ప్రియుడితో జంప్

ఇంటిలోని బీరువాలో ఉన్న బంగారు నగలు, రూ. 20 వేల నగదు తీసుకున్న సునీత తన మొబైల్ ఫోన్ ఇంటిలో పెట్టి ప్రియుడు దర్గా యాదవ్ తో కలిసి ఊరి విడిచి వెళ్లిపోయింది. సునీత ఎవరో బంధువుతో వెలుతున్నదని స్థానికులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇద్దరూ మాయం అయ్యారు.

భర్త ఫ్యామిలీకి షాక్

భర్త ఫ్యామిలీకి షాక్

ఇంటికి వచ్చిన అమర్ సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు సునీత కనపడపోవడంతో చుట్టుపక్కల వారిని విచారించారు. ఎవరో యువకుడితో వెళ్లిందని తెలుసుకున్న అమర్ సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. అమర్ సింగ్ యాదవ్ సోదరుడు సందీప్ యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సునీత, దుర్గా యాదవ్ ల కోసం గాలిస్తున్నారు.

English summary
Newly married woman escape with lover in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X