Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్త సీఎంగా కేజ్రీవాల్ - ఊహించని రాజకీయం..!!

జాతీయ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్, బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జమిలి ఎన్నికల దిశగా బీజేపీ నాయకత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రత్యేక ఫోకస్ చేస్తోంది. ఢిల్లీలో గెలిచిన బీజేపీ ఈ నెల 23న పార్టీ శాసనభా పక్ష సమావేశం కు నిర్ణయించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేజ్రీవాల్ భవిష్యత్ పైన చర్చ జరుగుతున్న వేళ రాజకీయం అనూహ్య టర్న్ తీసుకుంటోంది.

సీఎం గా మళ్లీ ఛాన్స్
ఢిల్లీలో ఆప్ అనూహ్యంగా ఓటమి పాలమైంది. 27 ఏళ్ల తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ పరాజయం తో కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆప్ అవినీతి కారణంగానే ప్రజలు తిరస్కరించారనే వాదన వినిపిస్తోంది. కేజ్రీవాల్ సైతం ఎమ్మెల్యేగా ఓడిపోవ టంతో ఆప్ కు పెద్ద నష్టంగా మారింది. కేజ్రీవాల్ దీంతో ఇక రాజ్యసభ ఎంపీగా కొనసాగే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. అయితే, అనూహ్యంగా కాంగ్రెస్ ఢిల్లీ ఫలితాల తరువాత ఆప్ ను దెబ్బ కొట్టే రాజకీయం మొదలు పెట్టింది. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ కేంద్రంగా కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్దమైంది.

News Roaming that Kejriwal to replace Bhagwant Mann as Punjab CM details here

తాజా సమావేశంతో
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. దీంతో, కేజ్రీవాల్ అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ అక్కడ ఆప్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీంతో, ఢిల్లీలో ఓడిన కేజ్రీవాల్ లూధియానా ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం గా ఉన్న మాన్ ను తప్పించి కేజ్రీవాల్ సీఎం అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌ లో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్‌ సమావేశం నిర్వహించి నట్లు తెలుస్తోంది.

కేజ్రీవాల్ డిసైడ్ అయ్యారా
పంజాబ్ సీఎం గా వెళ్లాలనే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పంజాబ్‌లో కనీసం 40 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్‌ నేత ప్రతాప్‌ సింగ్‌ బాజ్వా చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. పంజాబ్‌ ఆప్‌లో చీలిక తప్పదనే ప్రచారా నికి ఆయన వ్యాఖ్యలు మరింత బలాన్ని పెంచాయి. ఇక, ముఖ్యమంత్రి మాన్ వ్యవహార శైలి పైన ఆగ్రహంగా ఉన్న ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాల్లో చీలికను తప్పించేందుకే కేజ్రీవాల్‌ ఢిల్లీలో సమావేశం నిర్వహించారని ప్రచారం జరిగింది. కాగా, కాంగ్రెస్‌ నేతల ప్రచారాన్ని సీఎం మాన్‌ కొట్టిపారేశారు. దీంతో, కేజ్రీవాల్ రాజకీయ నిర్ణయాలు ఎలా ఉంటాయనే ఆసక్తి కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+