నోట్ల రద్దు ఎఫెక్ట్ : మణిపూర్‌లో న్యూస్ పేపర్స్ బంద్!
నోట్ల రద్దు ఎఫెక్ట్ తో మణిపూర్ లో ఏకంగా పత్రికా సమాచారమే బంద్ అయిన పరిస్థితి. పత్రికా నిర్వహణకు సరిపడేంత డబ్బు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కాంగ్లా పావ్ డైలీ సంపాదకుడు పోనమ్ లబాంగ
మణిపూర్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సామాన్యులంతా ఇంటి వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికి నానా తిప్పలు పడుతుంటే.. పలు పబ్లిక్ రంగాలు సైతం కొన్నిరోజుల పాటు సర్వీసులను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మణిపూర్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
నోట్ల రద్దు ఎఫెక్ట్ తో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో ఏకంగా పత్రికా సమాచారమే బంద్ అయిన పరిస్థితి. పత్రికా నిర్వహణకు సరిపడేంత డబ్బు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కాంగ్లా పావ్ డైలీ సంపాదకుడు పోనమ్ లబాంగ్ మన్ గ్యాంగ్ వెల్లడించారు. ప్రకటనదారుల వద్ద కూడా కొత్త నోట్లు లేకపోవడంతో.. పత్రికా యాజమాన్యానికి రెవెన్యూ తగ్గిపోయింది. దీంతో పెద్ద మొత్తంలో కరెన్సీ అందుబాటులోకి వచ్చేంత వరకు పత్రికను మూసివేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

గురువారం నాడు అత్యవసరంగా నిర్వహించిన ఆల్ మణిపూర్ న్యూస్ పేపర్స్ పబ్లిషర్స్ అసోసియేషన్ డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పత్రికా కార్యకలాపాలు నిలిపేయాలని అక్కడి యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. చట్టపరమైన లావాదేవిలకు కూడా అవకాశం లేకపోవడంతో గురువారం నుంచి పత్రికా ఆఫీసులు మూసివేయనున్నట్టు అసోసియేషన్ ప్రకటించింది. ఇదే ఎఫెక్ట్ స్కూల్స్ పై కూడా పడే అవకాశం కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications