వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Next CM: కర్ణాటక కొత్త సీఎం, పంచాయితీ ఢిల్లీకి షిఫ్ట్, పేరుకే బెంగళూరులో చర్చ, బీఎల్ సంతోష్ ఎంట్రీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంలో డిసైడ్ చేసే పంచాయితీ ఐటీ హబ్ బెంగళూరు నుంచి ఢిల్లీకి మారిపోయింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక బీజేపీ నాయకుడు బీఎల్. సంతోష్ ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ తో చర్చలు ప్రారంభించారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అభిప్రాయాలు తెలుసుకునే బాధ్యతను కేంద్ర మంత్రి దర్రేంద్ర ప్రసాద్, కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ అరుణ్ సింగ్ కు అప్పగించారు. ఇప్పుడు బీఎస్. యడియూరప్ప వారసుడు ఎవరు ? అనే పంచాయితీ మొత్తం ఢిల్లీలో జరగనుంది.

BSY vs July: జులై వస్తే ఈ సీఎంకు చలి, జ్వరం, బలవంతంగా రాజీనామాలు, ఆషాడమాసం ఆఫర్ !BSY vs July: జులై వస్తే ఈ సీఎంకు చలి, జ్వరం, బలవంతంగా రాజీనామాలు, ఆషాడమాసం ఆఫర్ !

 బీఎల్ సంతోష్ సీఎం ?

బీఎల్ సంతోష్ సీఎం ?

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంలో డిసైడ్ చేసే పంచాయితీ ఐటీ హబ్ బెంగళూరు నుంచి ఢిల్లీకి మారిపోయింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక బీజేపీ నాయకుడు బీఎల్. సంతోష్ ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ తో చర్చలు ప్రారంభించారు. గతంలో కూడా బీఎస్. యడియూరప్ప తరువాత బీఎల్. సంతోష్ కర్ణాటక ముఖ్యమంత్రి అవుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు బీఎల్. సంతోష్ ను ఢిల్లీకి పిలిపించడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

 బీజేపీ ఇన్ చార్జ్ క్లారిటి

బీజేపీ ఇన్ చార్జ్ క్లారిటి

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతున్న బీఎస్. యడియూరప్ప వారసుడు ఎవరు ? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ అరుణ్ సింగ్ అన్నారు. మీడియాతో మాట్లాడిన అరుణ్ సింగ్ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ లో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ మీడియాకు చెప్పారు.

బెంగళూరులో పేరుకు మాత్రమేనా ?

బెంగళూరులో పేరుకు మాత్రమేనా ?

బెంగళూరులో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటామని అరుణ్ సింగ్ స్పష్టం చేశారు. కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత వారు ఏం చెప్పారు అనే పూర్తి సమాచారం బీజేపీ హైకమాండ్ కు పంపిస్తామని అరుణ్ సింగ్ అన్నారు. అయితే పేరుకు మాత్రమే బెంగళూరులో ఎమ్మెల్యేలతో చర్చ జరుగుతుందని, కథ మొత్తం ఢిల్లీలో నడుస్తుందని సమాచారం.

 కర్ణాటకకు పరిశీలకులు

కర్ణాటకకు పరిశీలకులు

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అభిప్రాయాలు తెలుసుకునే బాధ్యతను బీజేపీ హైకమాండ్ కేంద్ర మంత్రి ధర్రేంద్ర ప్రసాద్, కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ అరుణ్ సింగ్ కు అప్పగించారు. ఇప్పుడు బీఎస్. యడియూరప్ప వారసుడు ఎవరు ? అనే పంచాయితీ మొత్తం ఢిల్లీలో జరగనుంది.

 ఎవరి రామాయణం వారిదే

ఎవరి రామాయణం వారిదే

కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో ఆ రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి బసవరాజ్ బోమ్మయ్, గనుల శాఖా మంత్రి మురగేష్ నిరాణి, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది, మరో ఉప ముఖ్యమంత్రి అశ్వథ్ నారాయణ ఉన్నారు. ఇక బ్రాహ్మణుల కులం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక స్పీకర్ విశ్వేర కాగేరి పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే యడియూరప్ప వారసుడు ఎవరు ? అని విషయంలో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

English summary
Next CM: As Karnataka Chief Minister B.S. Yediyurappa resigned on Monday in Bengaluru after weeks of speculation, part of the action shifted to New Delhi and the national leadership of the BJP, which now has the task of evolving a consensus over his replacement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X