ఎన్నో అక్రమాలు... శశికళకు షాక్: భూమి లాక్కున్నారని ఫిర్యాదు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ భూమి లాక్కున్నారని ఆరోపిస్తూ అరప్పోర్‌ ఇయక్కమ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. శశికళకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ భూమి లాక్కున్నారని ఆరోపిస్తూ అరప్పోర్‌ ఇయక్కమ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. శశికళకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.

ఊహించని విధంగా పన్నీరు సెల్వం ఎదురు తిరగడం, ఆయనకు పలువురు నేతలు మద్దతు పలకడం, ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ కూడా పన్నీరు వర్గంలో చేరడం, హైకోర్టులో ఎమ్మెల్యేల నిర్బంధంపై చుక్కెదురు కావడం.. ఇలా వరుస షాక్‌లు తగులుతున్నాయి.

ఇప్పుడు స్వచ్చంధ సంస్థ శశికళ పైన భూమి లాక్కున్నారని ఫిర్యాదు చేసింది. ఈ సంస్థ అవినీతికి, అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. గత రెండు దశాబ్దాల్లో శశికళ, ఆమె కుటుంబసభ్యులకు తమిళనాడులోని పలు చోట్ల భూములు లాక్కున్న వ్యవహారాలతో సంబంధం ఉందని సాక్ష్యాలతో సహా తెలిసిందని ఎన్జీవో కన్వీనర్‌ జయరాం వెంకటేశన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌కు ఫిర్యాదు చేశారు.

NGO Files Land Grabbing Case Against Sasikala Natarajan

పలుచోట్ల ప్రభుత్వ భూములు, సరస్సులు, ప్రయివేటు భూములు లాక్కున్నారని, వీటిపై వచ్చిన ఫిర్యాదులపై స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ముఖ్యంగా సిరుతవూర్‌, పయనూర్‌, కరుంకుజిపాలెంలతో పాటు తిరుపొరూర్‌, కాంచీపురాల్లోని గ్రామాల్లో ఎన్నో సర్వే నెంబర్లను శశికళ, ఆమె కుటుంబీకులు ఆక్రమించుకున్నారన్నారు. వారు ఆక్రమించుకున్న 112 ఎకరాల భూములకు పోలీసులే కాపలా కాస్తున్నారన్నారు. ఇంకా పలు భూముల ఆక్రమణపై ఎన్జీఓ కన్వీనర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+