నరేంద్ర మోడీని చంపేస్తాం: ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. మోడీకి వచ్చిన బెదిరింపు మెయిల్‌కు సంబంధించిన వివరాలపై ఎన్ఏఐ హోంమంత్రిత్వశాఖకు లేఖ రాసిందని సమాచారం. జాతీయ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి.

ఓ మెయిల్ ఐడీ నుంచి ప్రముఖ వ్యక్తులకు వచ్చిన బెదిరింపు కాపీలను హోంశాఖకు పంపిన ఎన్ఐఏ.. వీటిపై తగిన చర్య తీసుకోవాలని ఆ లేఖలో కోరింది. ఆగస్టు 8న వచ్చిన ఈ బెదిరింపు మెయిల్‌తో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

NIA accesses letter with 3-word threat – ‘Kill Narendra Modi’

బెదిరింపు మెయిల్ నేపథ్యంలో ప్రధానమంత్రి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్ఐఏ లేఖ ఆధారంగా హోంమంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రధానికి భద్రతను కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) దృష్టికి తీసుకెళ్లింది.

కాగా, మెయిల్ వివరాలు ఇలా ఉన్నాయి.

From: [email protected]

To: [email protected]

Sent on: Saturday, 8 August 2020

Time: 1:34:06 am

Instruction: Kill Narendra Modi

బెదిరింపు మెయిల్‌పై దర్యాప్తు చేపట్టేందుకు రా, ఇంటెలీజెన్స్ బ్యూరో, డిఫెన్స్ ఇంటెలీజెన్స్ ఏజెన్సీల ప్రతినిధులను ఎన్ఐఏ రంగంలోకి దించింది. ఈ మెయిల్ ఎవరు పంపారు? ఎక్కడ్నుంచి వచ్చారనేదానిపై దర్యాప్తు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+