బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

NIA: అధికార పార్టీ లీడర్ హత్య కేసు, నల్లికాయ రోడ్డులో ఎన్ఐఏ ఎంట్రీతో షాక్, పీఎఫ్ఐ, ఎస్ డీపీఐకి సినిమా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మంగళూరు: ఎస్ డీపీఐ, పీఎఫ్ఐ కార్యాలయాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటీవల హత్యకు గురైన బీజేపీ నాయకుడు ప్రవీణ్ నెట్టూరు అలియాస్ ప్రవీణ్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు గురువారం వేకువ జామున మంగళూరు సిటీలోని నల్లికాయ రోడ్డులోని పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ కార్యాలయాల్లో సోదాలు మొదలుపెట్టారు. గురువారం వేకువ జామున పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ కార్యాలయాల్లో, ఆ పార్టీల నాయకుల నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండు పార్టీలకు చెందిన నాయకులు, వందలాది మంది కార్యకర్తలు ఎన్ఐఏ గో బ్యాక్ అంటూ ఆందోళనకు దిగారు. స్థానిక పోలీసులతో పాటు సాయుధ బలగాలు రంగంలోకి దిగి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Paramour: మాయలేడి, నలుగురు భర్తలు, ఐదో ప్రియుడితో రొమాన్స్, క్లైమాక్స్ లో అడవిలో ?Paramour: మాయలేడి, నలుగురు భర్తలు, ఐదో ప్రియుడితో రొమాన్స్, క్లైమాక్స్ లో అడవిలో ?

బీజేపీ నాయకుడి హత్య

బీజేపీ నాయకుడి హత్య

ఇటీవల దక్షిణ కన్నడ జిల్లాలోని బీజేపీ నాయకుడు ప్రవీణ్ నెట్టూరును దారుణంగా హత్య చేశారు. ప్రవీణ్ హత్య కేసుకు ఎస్ డీపీఐ, పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలకు సంబంధం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రవీణ్ హత్యకు ఉగ్రవాదులకు లింక్ ఉందని బీజేపీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు.

ఎన్ఐఏ ఎంట్రీతో షాక్

ఎన్ఐఏ ఎంట్రీతో షాక్

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ పార్టీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసును ఎన్ఐఏకి అప్పగించింది. బీజేపీ నాయకుడు ప్రవీణ్ నెట్టూరు అలియాస్ ప్రవీణ్ హత్య కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. గురువారం వేకువ జామున 3.30 గంటల సమయంలో మంగళూరులో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు.

 నల్లికాయ రోడ్డు బ్లాక్

నల్లికాయ రోడ్డు బ్లాక్

కర్ణాటకలోని మంగళూరులోని ఎస్ డీపీఐ, పీఎఫ్ఐ కార్యాలయాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. గురువారం వేకువ జామున మంగళూరు సిటీలోని నల్లికాయ రోడ్డులోని పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ కార్యాలయాల్లో సోదాలు మొదలుపెట్టారు. ఎన్ఐఏ అధికారుల ఎంట్రీతో నల్లికాయ రోడ్డు ఇరు వైపుల బ్లాక్ చేసిన పోలీసులు, సాయుధ బలగాలు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.

 పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ నాయకుల ఇళ్లల్లో సోదాలు

పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ నాయకుల ఇళ్లల్లో సోదాలు


గురువారం వేకువ జామున 3.30 గంటల సమయంలో పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ కార్యాలయాల్లో, ఆ పార్టీల నాయకుల నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. 8 ప్రత్యేక బృందాలుగా విడిపోయిన ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. రెండు పార్టీలకు చెందిన నాయకులు, వందలాది మంది కార్యకర్తలు ఎన్ఐఏ గో బ్యాక్ అంటూ ఆందోళనకు దిగారు. స్థానిక పోలీసులతో పాటు సాయుధ బలగాలు రంగంలోకి దిగి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
NIA: National Investigation Agency officials raided the office of PFI and SDPI in Mangaluru in connection with the recent murder of Praveen Nettaru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X