Terrorists: ఐసీస్ ఉగ్రవాదులతో లింక్, కర్ణాటకలో అరెస్టులు, దెబ్బతో అండర్ గ్రౌండ్ లోకి !
బెంగళూరు/శివమొగ్గ/దావణగెరె: కర్ణాటకలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువ అవుతున్నాయని తెలుసుకున్న కేంద్ర హోమ్ శాఖ సీరియస్ అయ్యింది. ఇప్పటికే అనేక ఉగ్రవాద కార్యకలాపాలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అనుమానిత ఉగ్రవాదుల మీద కేంద్ర హోమ్ శాఖ, ఎన్ఐఏ అధికారులు, పోలీసులు నిఘా వేశారు. ఇప్పుడు కర్ణాటకలో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్)కు పని చేస్తూ అరెస్టు కావడం కలకలం రేపింది. నిందితులు వాళ్ల సహచరులతో కలిసి విధ్వంసాలకు పక్కాప్లాన్ వేస్తున్నారని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

కుక్కర్ బాంబుతో డొంక కదిలింది
ఇటీవల మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు తరువాత దేశం మొత్తం కర్ణాటక వైపు చూసింది. కుక్కర్ బాంబు పేలుడు కేసు ఎన్ఐఏ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కుక్కర్ బాంబు పేలుడు నిందితుడు మోహమ్మద్ షారిక్ అలియాస్ షారిక్ కు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకోవడంతో అతన్ని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి బెంగళూరుకు పిలుచుకుని వచ్చి విచారణ చేస్తున్నారు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ?
కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన బాంబు పేలుడు కేసు, మతఘర్షణల కేసులకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు బుధవారం మంగళూరులోని హీరా కాలేజ్ సమీపంలో అబ్దుల్ రెహమాన్, దావరణగెరె జిల్లాలోని హోన్నాళి తాలుకాలెని దేవనాయకనళ్లిలో నివాసం ఉంటున్న నదీమ్ అహమ్మద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

లీక్ చేసిన నిందితులు
మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసు ప్రధాన నిందితుడు మోహమ్మద్ షారిక్ అలియాస్ షారిక్ తో నిందితులు ఇద్దరు నిత్యం టచ్ లో ఉన్నారని ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. ఇప్పటికే ఇదే కేసులో షారిక్ తో సంబంధాలు ఉన్న నలుగురిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి విచారణ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

ఐసీస్ రిక్రూట్ మెంట్ !
భారతదేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐసిస్) కార్యకలాపాలు విస్తరించడానికి నిందితులు ప్రయత్నించారని, మజిన్, నదిమ్ ఐసిస్ కార్యకపాలకు రిక్రూట్ మెంట్ చేసుకున్నారని ఎన్ఐఏ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. శిమొగ్గ జిల్లాలోని తుంగా నది తీరంలో నిందితులు ప్రయోగాత్మకంగా బాంబు పేలుడు నిర్వహించాని అధికారులు అంటున్నారు.

ఆగస్టు 15వ తేదీన ఏం చేశారంటే ?
ఆగస్టు 15వ తేదీన శివమొగ్గలో సావర్కర్ ఫోటోలును తగలబెట్టిన నిందితులు ఆ రోజు శివమొగ్గలో మతఘర్షణలు జరగడానికి కారణం అయ్యారని, నిందితులు పలు చోట్ల విధ్వంసాలు చెయ్యడానికి ప్లాన్ వేశారని సమాచారం ఉందని, నిందితులను విచారణ చేస్తున్నామని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. మొత్తం మీద కర్ణాటకలో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఇద్దరు అరెస్టు కావడం కలకలం రేపింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications