కోపం వస్తోంది: నైస్ ఉగ్రదాడిపై బాలీవుడ్ సెలబ్రిటీల రియాక్షన్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాద దాడిలో మృతుల సంఖ్య 80కు చేరింది. ఈ ఉగ్రదాడిని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నైస్ నగరంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ట్విట్టర్‌లో ట్వీట్స్ చేశారు.

కామెంట్ చేసిన వారిలో బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్‌లతో పాటు హీరోయిన్లు సోఫియా చౌదరి, బిపాసాబసులు ఉన్నారు. ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్, మీడియా ప్రముఖులు రాజ్ దీప్ సర్దేశాయ్, బర్కాదత్ సహా పలువురు ప్రముఖులు నీస్ ఉగ్రదాడి బాధితులకు బాసటగా నిలిచారు.

Nice attack: Akshay, Anushka, Bipasha Basu and others Bollywood celebs express shock

'ఉదయం లేవగానే విషాద వార్త తెలిసింది. హృదయం ద్రవించిపోతోంది. గతేడాది నేను అక్కడ ఉన్నా. నీస్ నగరం చాలా అందమైన ప్రాంతం. అక్కడి ప్రజలు చాలా మంచివారు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా'నని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పేర్కొన్నాడు.

'నీస్ దాడి తీవ్రవాదం సృష్టించిన క్రూరమైన చర్య. మరో ఉగ్రదాడితో ఫ్రాన్స్ ప్రజలు షాక్ తిన్నాడు. బాధితులు వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నా'నని హీరోయిన్ బిపాసా బసు తెలిపింది.

'అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. షాక్ కు గురయ్యాను. కోపం వస్తోంది. గుండె పగిలిపోతోంది. గత నెలలో నేను నీస్ నగరంలో ఉన్నాను. బాధిత కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాల'ని బ్రిటీష్ నటి, గాయని సోఫీ చౌద్రి వెల్లడించింది.

'నీస్ ఉగ్రదాడి గురించి విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగింది. హృదయం ద్రవీస్తోంది. భయానక దాడికి గురైన బాధితుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా'నని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bollywood celebrities, including Akshay Kumar and Bipasha Basu, have condemned the attack on Nice, France, that killed at least 80 people on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి