వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక హర్యానా.. నేటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ..

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ వల్ల.. నైట్ కర్ఫ్యూ దిశగా రాష్ట్రాలు అడుగు వేస్తున్నాయి. ఎంపీ, యూపీ తర్వాత హర్యానా నిలిచింది. ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ అమలు చేసింది. మహారాష్ట్రలో కూడా కర్ఫ్యూ లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒమిక్రాన్ కేసులు ఎక్కవగా రావడంతో.. హర్యానాలో కర్ఫ్యూపై నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు బయటకు జనాలు రావొద్దు.

మాల్స్, రెస్టారెంట్లు, బ్యాంక్లు, మండీ, గ్రెయిన్ మార్కెట్, ఆఫీసులు 200 మంది కన్నా ఎక్కువ మందిని అలొ చేయడానికి వీలు లేదు. ఇండోర్, అవుడ్ డోర్లలో కూడా తగిన ఆంక్షలు ఉన్నాయి. హర్యానాలో 6 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు గుమికూడొద్దని ప్రభుత్వం తెలిపింది. దీంతో కరోనా కేసులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

 Night Curfew In Haryana, Unvaccinated To Be Banned From Public Places

మధ్యప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తోంది. రేపటి నుంచి యూపీ స్టార్ట్ చేయనుంది. అన్నీ రాష్ట్రాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఎంపీ ముందడుగు వేసింది. యూపీ వేయబోతుంది. ఆ బాటలో హర్యానా కూడా పయనిస్తోంది. ఇటు ఒమిక్రాన్‌ నిలువరించడం బూస్టర్ డోసుతో సాధ్యం అని నిపుణులు తెలియజేశారు. ఇదీ కాస్త సానుకూల అంశంగా మారింది.

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు మొత్తం 38కి చేరాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన 12మందిలోనూ ఒమిక్రాన్ గుర్తించారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు నిర్ధారణ అయిన 38 ఒమిక్రాన్ కేసులలో ఆరుగురు మాత్రమే హై రిస్క్ దేశాల నుంచి రాగా, మిగిలినవారు ఒమిక్రాన్ రిస్క్ లేని దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు.

English summary
Starting to night, public commute will be prohibited from 11 pm to 5 am across Haryana till further orders Chief minister Manohar Lal Khattar today said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X