నిఖిలేశ్వర్, మానస ఎండ్లూరి, అనసూయకు సాహిత్య అకాడమీ అవార్డులు -వీరప్ప మెయిలీ, మొత్తం 38 మందికి
సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 'కేంద్ర సాహిత్య అకాడమీ' పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2020 ఏడాదికిగానూ రెండు విభాగాల కింద మొత్తం 38 మందికి అవార్డులు లభించాయి. ఈసారి జాబితాలో ఇద్దరు తెలుగు రచయితలు ఉండటం గమనార్హం. దిగంబర కవిగా తెలుగునాట పాపులరైన నిఖిలేశ్వర్ కు సాహిత్య అకాడమీ అవార్డు లభించగా, యువ రచయిత్రి మానస ఎండ్లూరి.. యువ సాహిత్య పురస్కారం పొందారు. కన్నెగంటి అనసూయకు బాలసాహితి పురస్కారం దక్కింది.

మొత్తం 20 భాషల్లో సాహిత్య అకాడమి పురస్కారాలను, 18 భాషల్లో సాహిత్య అకాడమీ యువ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో పద్య కవిత్వంలో 7, నవలలకు 4, చిన్న కథలకు 5, నాటకాలకు 2 సాహిత్య అకాడమీ పురస్కారాలు వచ్చాయి. తెలుగులో నిఖిలేశ్వర్ రచించిన "అగ్నిశ్వాస" కవిత్వానికి సాహిత్య అకాడమీ అవార్డు, మానస ఎండ్లూరి రచించిన షార్ట్ స్టోరి "మిలింద"కు యువ సాహితీ పురస్కారం లభించాయి. 'స్నేహితులు' అనే షార్ట్ స్టోరీకిగానూ కన్నెగంటి అనసూయకు బాలసాహితి పురస్కారం లభించింది.
సాహిత్య అకాడమీ 2020 అవార్డులు పొదిన రచయితల జాబితాలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత వీరప్ప మెయిలీ, ప్రముఖ జర్నలిస్టు అరుంధతి సుబ్రహ్మణియన్ కూడా ఉన్నారు. కన్నడ భాషలో ''శ్రీ బాహుబలి అహింసాదిగ్విజయం'' పేరుతో రాసిన కవితా సంకలనానికిగానూ వీరప్ప మెయిలీకి అవార్డు దక్కగా, అరుంధతి ఇంగ్లీష్ భాషలో రాసిన కవితా సంకలనం 'When God is a Traveller'కు పురస్కారం దక్కింది. ఇక..

2020 ఏడాదికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన వారిలో హరీశ్ మీనాక్షి(గుజరాతి), అనామికా(హిందీ), ఆర్ఎస్ భాస్కర్(కొంకణి), ఇరుగ్బమ్ దవేన్(మణిపురి), రూప్ చంద్ హన్స్డా(సంతాలి), నందా ఖరే(మరాఠి), మహేశ్ చంద్ర శర్మ గౌతమ్(సంస్కృతం), ఇమాయూమ్, హు(తమిళం), హుస్సేన్ ఉల్ హాకా(ఉర్దూ), అపూర్బా కుమార్ సైకియా(అస్సామీ), దివంగత ధరణిధర్ ఓవారి(బోడో), దివంగత హిదయ్ కౌల్ భారతి(కాశ్మీరీ), కామకాంత్ ఝా(మైథిలి), గురువేవ్ సింగ్ రూపానా(పంజాబీ), గియాన్ సింగ్(డోంగ్రీ), జెతో లాల్వానీ(సింధీ), మణిశంకర్ ముఖోపాధ్యాయ(బెంగాలీ) తదితరులు ఉన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications