సీఎం యోగి కార్యాలయం వద్ద ఘోరం: అనూహ్యంగా చిన్నారి మరణం..

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన కోసం సిద్దం చేస్తున్న కార్యాలయాల సముదాయం వద్ద ప్రమాదవశాత్తు ఓ బాలిక మృత్యువాత పడింది. కార్యాలయ ప్రాంగణంలో ఆడుకుంటున్న సమయంల

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన కోసం సిద్దం చేస్తున్న కార్యాలయాల సముదాయం వద్ద ప్రమాదవశాత్తు ఓ బాలిక మృత్యువాత పడింది. కార్యాలయ ప్రాంగణంలో ఆడుకుంటున్న సమయంలో.. ఇనుప గేటు బాలికపై పడటంతో ఈ ప్రమాదం సంభవించింది.

మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ 'లోక్ భవన్' ఉన్నప్పటి నుంచే.. ఈ భవనాన్ని మరమ్మత్తులు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సీఎం యోగి కార్యాలయం ఇందులోకి మారనుండటంతో.. పలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఓ గేట్ వద్ద కిరణ్(9) ఆడుకుంటున్న సమయంలో.. అనూహ్యంగా పాపపై పడింది.

Nine-year-old girl dies as iron gate falls on her at ‘Lok Bhawan’ in UP

దీంతో హుటాహుటిన పాపను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. బాలిక అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. కాగా, లోక్ భవన్ లో సీఎం కార్యాలయంతో పాటు కేబినెట్ మంత్రుల కార్యాలయాలు ఉంటాయి. ముఖ్యమైన సమావేశాలు ఇందులోనే నిర్వహిస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+