భారత్‌కు నీరవ్‌మోదీ అప్పగింతకు లైన్ క్లియర్.. ఎప్పుడంటే ?

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను వేల కోట్ల రూపాయలు మోసం చేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని (Nirav Modi) భారత్‌కు అప్పగించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అతడిని భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమమైందని తెలుస్తోంది. నవంబరు 23న నీరవ్‌ను భారత అధికారులకు అప్పగించే అవకాశం ఉందని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి.

భారత ప్రభుత్వం బ్రిటీష్‌ అధికారులకు అప్పగింత ప్రక్రియకు (Nirav Modi Extradition) సంబంధించి ఇటీవల ఓ హామీపత్రాన్ని సమర్పించింది. నీరవ్‌ను భారత్‌కు తీసుకొచ్చిన తర్వాత కేవలం మోసం, మనీలాండరింగ్‌ కేసులలో మాత్రమే విచారణ జరుపుతామని.. ఇతర ఏజెన్సీల కస్టడీకి అప్పగించబోమని ఆ పత్రంలో స్పష్టం చేసినట్లు సమాచారం.

సీబీఐ, ఈడీ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌, కస్టమ్స్‌, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందజేశాయి. భారత్‌కు అప్పగించిన అనంతరం నీరవ్‌ మోదీని ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉంచుతారని.. హై ప్రొఫైల్‌ ఖైదీలకు లభించే అన్ని సౌకర్యాలను కల్పిస్తారని పత్రంలో హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

తన అప్పగింత ప్రక్రియను సవాల్‌ చేస్తూ నీరవ్‌ మోదీ ఇటీవల మరోసారి యూకే కోర్టును (Nirav Modi Moves UK Court) ఆశ్రయించారు. తనను భారత్‌కు అప్పగిస్తే దేశంలోని అనేక విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో చిత్రహింసలకు గురిచేస్తాయని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని అభ్యర్థించారు. లండన్‌ కోర్టు ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం నవంబరు 23న తదుపరి విచారణ సమయంలో అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. తప్పుడు ఎల్‌వోయూలతో పీఎన్‌బీని (PNB Scam) నీరవ్‌ మోదీ మోసం చేసిన వ్యవహారం 2018 జనవరిలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కుంభకోణంపై ఈడీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి. అయితే, అప్పటికే నీరవ్‌ దేశం విడిచి పారిపోయారు. ఈడీ అతడిని పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది.

2018 డిసెంబరులో నీరవ్‌ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్‌ విజ్ఞప్తి చేసింది. 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. అతడిని భారత్‌కు అప్పగించడానికి 2021లో నాటి బ్రిటన్‌ హోం మంత్రి ప్రీతి పటేల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నీరవ్‌ లండన్‌ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ కోర్టు దానిని తిరస్కరించింది. బెయిల్‌ కోసం అనేకసార్లు దరఖాస్తు చేసినప్పటికీ ప్రతిసారీ భంగపాటు ఎదురైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+