జీతాలివ్వలేను, వేరే జాబ్ చూసుకోండి: తన కంపెనీ ఉద్యోగులకు నీరవ్ మోడీ షాక్
న్యూఢిల్లీ: భారత్‌లో తన కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులకు తాను జీతాలు ఇవ్వలేనని, వేరే ఉద్యోగాలు చూసుకోవాలని నీరవ్ మోడీ సూచించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడి అతను దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
అతను భారత్‌లోని తన కంపెనీ ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా లేఖలు పంపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాను జీతాలు చెల్లించలేనని, ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు చూసుకోవాలని చెప్పాడు. దర్యాఫ్తు సంస్థలు తన కంపెనీల స్టాక్స్‌ను సీజ్ చేశాయని చెప్పాడు.

బ్యాంకు ఖాతాలు పని చేయకుండా చేశారు
ఆదాయ పన్ను శాఖ తన బ్యాంకు ఖాతాలను పని చేయకుండా చేసిందని నీరవ్ మోడీ చెప్పారు. దీంతో తాను ఉద్యోగులకు వేతనాలు చెల్లించే పరిస్థితులో లేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తు గురించి కూడా స్పష్టత లేదని తేల్చి చెప్పారు.
Recommended Video


ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతానో
ప్రస్తుత పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతానో తనకు తెలియదని ఆ మెయిల్‌లో నీరవ్ మోడీ పేర్కొన్నారు. వేరే ఉద్యోగాలు చూసుకోవడమే మంచిదని తన ఉద్యోగులకు సుచించారు.

తన పాస్‌పోర్టు రద్దుపై నీరవ్ లేఖ
తన పాస్‌పోర్టును రద్దు చేయడంపై నీరవ్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్, సీబీఐ, విదేశాంగ శాఖలకు కూడా లేఖలు రాసినట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో నీరవ్‌తో పాటు ఆయన మామ ఛోక్సీపై కూడా సీబీఐ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన విషయం తెలిసిందే.

నీరవ్ మోడీపై కేసు నిలబడదు
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు తాను రూ.11,300 కోట్లు బాకీలేనని నీరవ్ మోడీ చెప్పిన మరుసటి రోజు ఆయన కౌన్సెల్ విజయ్ అగర్వాల్ ఆసక్తికరర వ్యాఖ్యలు చేశారు. నీరవ్ మోడీ పైన కేసులు నిలబడవని అభిప్రాయపడ్డారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications