నిర్భయ కేసు.. అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ పై నేడే విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
2012 నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిలో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టు విచారించనుంది. అక్షయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే, జస్టిస్ ఆర్ బానుమతి, అశోక్ భూషణ్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.

నిర్భయ కేసు నిందితుల్లో ఒకరు ఆత్మహత్య , ఒకరు మైనర్
23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థిని నిర్భయను దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ మరియు రామ్ సింగ్ దోషులుగా నిర్ధారించారు. రామ్ సింగ్ జైలులో తనను తాను చంపుకోగా, నేరానికి పాల్పడిన మరో వ్యక్తి , మైనర్ అయిన కారణంగా బాల నేరస్తుల కేంద్రంలో మూడేళ్లపాటు ఉండి విడుదలయ్యాడు.

ముగ్గురికీ మరణ శిక్ష విధించిన హైకోర్టు.. సమర్ధించిన సుప్రీం
నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో హైకోర్టు వేసిన శిక్షలను సుప్రీంకోర్టు సమర్ధించింది. మరియు దోషులకు వేసిన మరణశిక్షలను ధృవీకరించింది. గత ఏడాది, పవన్ గుప్తా, వినయ్ శర్మ మరియు ముఖేష్ సింగ్ తమ నేరారోపణలను సమర్థించిన 2017 ఉత్తర్వులను పునః పరిశీలించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సమీక్ష పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీం ధర్మాసనం నిరాకరించింది .

రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన వినయ్ శర్మ.. సమీక్షించాలన్న అక్షయ్ కుమార్
వారిలో ఒకరు - వినయ్ శర్మ - రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు. ఇక అతని క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ఇక వినయ్ శర్మ తాను క్షమాభిక్ష కోరలేదని పేర్కొన్నాడు .ఇక ఈ కేసులో మరో నిందితుడు అక్షయ్ కుమార్ దాఖలు చేసిన సమీక్ష పిటిషన్ ను మంగళవారం మధ్యాహ్నం, సుప్రీంకోర్టు విచారించనుంది .పిటిషన్లో, అక్షయ్ చాలా అసంబద్ధమైన వాదనలు చేసాడు .

రివ్యూ పిటీషన్లో అసంబద్ధమైన వాదనలు .. మధ్యాహ్నం 2 గంటలకు విచారణ
ఇక అతని అభ్యర్ధనలో వేదాలు మరియు పురాణాలను ఉదహరించాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎలాగైనా ప్రజలను చంపుతున్నప్పుడు అతనికి మరణశిక్ష ఎందుకు అంటూ అసంబద్ధమైన వాదన చేస్తూ పిటీషన్ దాఖలు చేశాడు . అక్షయ్ అభ్యర్ధనను విచారించే ఇద్దరు న్యాయమూర్తులు గతంలో మిగతా ముగ్గురి రివ్యూ పిటీషన్లను తిరస్కరించారు. న్యాయమూర్తులు ఆర్ బానుమతి మరియు అశోక్ భూషణ్ మిగతా ముగ్గురు దోషుల సమీక్ష అభ్యర్ధనలను తిరస్కరించిన నేపధ్యంలో నేడు అక్షయ్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ పై విచారణ చెయ్యనున్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications