నిర్బయపై సంచలన ప్రకటన : 'మర్మాంగాల్లో ఇనుపరాడ్లు' నిరూపిస్తే 10లక్షలు?

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : 2012 లో చోటు చేసుకున్న నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిన విషయమే. నిందితులంతా నిర్భయ పట్ల ప్రవర్తించిన తీరుకు దేశం మొత్తం నివ్వెరపోయింది. అత్యాచారం చేయడమే కాకుండా.. ఓ ఇనుప రాడును ఆమె మర్మాంగాల్లోకి జొప్పించి అత్యంత అమానుషానికి తెగబడ్డారు నిందితులు.

అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇనుప రాడు ద్వారా నిందితులు ఆమె లోపలి అవయవాలను బయటకు లాగినట్లుగా పోలీసులు కోర్టుకు నివేదిక కూడా సమర్పించారు. కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసిన కోర్టు నిందితులకు ఉరి శిక్ష విధించగా ఢిల్లీ హైకోర్టు కూడా తీర్పుతో ఏకీభవించింది. అయితే నిందితుల తరుపున వాదిస్తున్న న్యాయవాది ఎం.ఎల్ శర్మ ఇప్పుడో సంచలన ప్రకటన చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నిందితులు ఇనుప రాడుతో నిర్భయను హింసించలేదని ఆరోపిస్తూ.. నిర్భయ ఘటనలో ఇనుప రాడ్ థియరీని నిరూపించిన వారికి రూ.10 లక్షల బహుమతిని అందజేస్తానని ప్రకటించారు సదరు న్యాయవాది. ఇదంతా ఓ కల్పిత కథనం ఆరోపిస్తున్న ఆయన.. నిర్భయ గానీ, ఆమె స్నేహితుడు గానీ ఈ విషయాన్ని ప్రస్తావించలేదని అంటున్నారు.

Nirbhaya gangrape: Rs 10 lakh award if iron rod theory is proved, says defence lawyer

గ్యాంగ్ రేప్ తరువాత బాధితురాలు పూర్తి మతి స్థిమితంతోనే వాంగ్మూలం ఇచ్చిందని పేర్కొన్న లాయర్ శర్మ.. అందులో ఇనుప రాడు ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. లేని వాదనను పోలీసులు కేసులో ఎలా జోడిస్తారని ప్రశ్నించారు శర్మ. నిర్భయ నిందితులైన ముఖేష్, పవన్ ల పక్షాన వాదిస్తోన్న శర్మ నిందితులు ఇనుపరాడును ఉపయోగించినట్లుగా ఎవరైనా నిర్దారిస్తే రూ.10 లక్షలు తానే స్వయంగా చెల్లిస్తానని ప్రకటించారు.

శర్మ వాదనపై స్పందించిన ప్రాసిక్యుషన్ :

శర్మ చేస్తోన్న ఆరోపణలను నిరూపించడానికి తాము సిద్దంగా ఉన్నామని ప్రాసిక్యుషన్ ప్రకటించింది. నిందితులు రెండు ఇనుప రాడ్లను బాధితురాలి మర్మాంగాల్లోకి జొప్పించారని.. అందులో ఒకటి 2 అడుగుల 9 అంగుళాలు కాగా, మరొకటి ఒక అడుగు 11 అంగుళాల పొడవుందని ప్రాసిక్యుషన్ పేర్కొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A lawyer representing the death row convicts in the 2012 Nirbhaya gangrape case has announced a Rs 10 lakh reward for anyone who can prove that the victim was violated with an iron rod.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి