వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ, ఆమె తల్లిపై లాయర్ ఏపీ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు: ఇతడ్నీ ఉరితీస్తే బాగుండేదంటూ నెటిజన్ల ఫైర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు దోషులకు శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఉరితీసిన విషయం తెలిసిందే. దోషులకు ఉరిశిక్ష అమలు కావడం పట్ల నిర్భయ తల్లిదండ్రుతోపాటు దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తవమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల తరపున వాదించిన న్యాయవాది అజయ్ ప్రకాశ్ సింగ్(ఏపీ సింగ్) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

న్యాయం ఆలస్యం..

న్యాయం ఆలస్యం..

నిర్భయ, ఆమె తల్లి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా నీచంగా వ్యవహరించారు. నిర్భయ దోషులను ఉరి నుంచి తప్పించేందుకు ఏపీ సింగ్ అనేక ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఉరిశిక్షకు రెండు గంటల ముందు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దోషుల్లో ఒకడపైన పవన్ గుప్తా రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో నలుగురు దోషులు ముకేష్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను శుక్రవారం తెల్లవారుజామున ఉరితీశారు. ఘటన జరిగి సుమారు ఏడేళ్ల తర్వాత దోషులకు ఉరిశిక్ష అమలైంది.

కడుపుకోతను వేడుక చేసుకుంటారా? అంటూ..

కడుపుకోతను వేడుక చేసుకుంటారా? అంటూ..

ఈ సందర్భంగా నిర్భయ తల్లిదండ్రులతోపాటు దేశ వ్యాప్తంగా యువత, మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఢిల్లీలో యువత స్వీట్లు పంచుకున్నారు. తమ కూతురుకు ఎట్టకేలకు న్యాయం జరిగిందంటూ నిర్భయ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలస్యమైనప్పటికీ న్యాయం గెలిచిందని చెప్పారు. దేశ మంతా ఆనందోత్సాహాల్లో ఉంటే.. నిర్భయ దోషుల తరపున వాదించి ఓడిపోయిన ఏపీ సింగ్ మాత్రం వివాదాస్పదరీతిలో వ్యవహరించారు. దోషుల తల్లుల కడుపుకోతను వేడుక చేసుకుంటారా? అంటూ మండిపడ్డారు. నిర్భయ, నిర్భయ తల్లిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు.

నిర్భయ, నిర్భయ తల్లి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా ఏపీ సింగ్ వ్యాఖ్యలు

నిర్భయ, నిర్భయ తల్లి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా ఏపీ సింగ్ వ్యాఖ్యలు


‘ఒక తల్లి కోసం ఇంతమంది ముందుకు వచ్చారు. మరి ఆ తల్లి తన కూతురు అర్ధరాత్రి ఎక్కడ తిరుగుతుందో ఎందుకు పట్టించుకోలేదు. ఎవరితో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ఎందుకు తెలుసుకోలేదు' అని ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు. దోషుల తల్లులు కూడా నవమాసాలు మోసి కన్నారని, వారికి కడుపుకోత ఉండదా? అంటూ తన అక్కసును వెళ్లగక్కాడు. అంతేగాక, ఉరిని వాయిదా వేసేందుకు తాను శాయశక్తులా ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు.

దోషులతోపాటు ఏపీ సింగ్‌ను ఉరితీస్తే బాగుండేందంటూ..

దోషులతోపాటు ఏపీ సింగ్‌ను ఉరితీస్తే బాగుండేందంటూ..

సిగ్గులేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ ఏపీ సింగ్‌‌పై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏపీ సింగ్ తన వ్యాఖ్యలకు జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సింగ్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిర్భయ దోషులతోపాటు ఏపీ సింగ్‌ను కూడా ఉరితీస్తే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఉరితీయాలని లేదంటే ఎన్ కౌంటర్ చేయాలని అంటున్నారు. కాగా, ఏపీ సింగ్ గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు డబ్బు, ఆరోగ్యం కంటే కూడా వ్యక్తిత్వమే ముఖ్యమని, నిర్భయ స్థానంలో తన కూతురు ఉండి ఉంటే ఆమెను తానే పెట్రోల్ పోసి నిప్పంటించేవాడనని వ్యాఖ్యానించారు. అప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు ఈ అహంకారపూరిత న్యాయవాది.

English summary
Nirbhaya verdict: Convicts’ lawyer AP Singh questions victim’s and her mother character.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X