ఉదయనిధి వ్యాఖ్యలకు నిర్మలమ్మ కౌంటర్-హిందువులపై ఇండియా కూటమి దాడే..
సనాతన ధర్మం మలేరియా లాంటిదని, దాన్ని వ్యతిరేకించడం కాదు నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ఆగడం లేదు. ఉదయనిధి వ్యాఖ్యల్ని వాడుకుంటూ ఎన్నికల వేళ హిందూ సెంటిమెంట్ ను రగిల్చేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్లు వరుసగా ఇది హిందూత్వపై దాడి అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు.
డీఎంకేతో పాటు విపక్ష ఇండియా కూటమి సనాతన ధర్మానికి వ్యతిరేకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు విభజనను ప్రోత్సహిస్తున్నట్లు ఉన్నాయని నిర్మల విమర్శించారు.ప్రజల మధ్య వివక్షను రూపుమాపాలని ఆమె సూచించారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే గ్రూపులకు కాంగ్రెస్ పార్టీ.. మద్దతు ఇస్తోందన్నారు.

ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కాదు, సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకే ఈ నిరసన అంటూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్ని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. జాతీయ ఛానల్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. సనాతన వ్యతిరేకత డీఎంకే యొక్క ఉచ్చారణ విధానంగా ఆరోపించారు. దానిని తాను స్వయంగా చూశానన్నారు. తమిళనాడులో ప్రజలు కష్టాలు పడ్డారని, భాషా సమస్య వల్ల దేశం మొత్తం అర్థం కాలేదన్నారు. ఎప్పటినుంచో అది అలానే ఉందన్నారు.
ఇప్పుడు సోషల్ మీడియా వల్ల మంత్రి అంటే ఏమిటో తెలుసుకోవడానికి అనువాదకుడి అవసరం లేదని నిర్మల తెలిపారు. 70 ఏళ్లుగా డీఎంకే ఇలాగా చేస్తోందన్నారు. ఇది కపటత్వం అన్నారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని పేర్కొన్న నిర్మల.. ఆయన ప్రభుత్వ పదవిలో చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘిస్తాడని తెలిసినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications