వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారీ''మణు''లు: ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో నిర్మలా సీతారామన్‌కు చోటు

|
Google Oneindia TeluguNews

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణి నాడార్ బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షాలు ఫోర్బ్స్ మ్యాగజీన్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజీన్ విడుదల చేసిన 100 మంది మహిళల జాబితాలో వీరికి స్థానం దక్కింది. ఇదిలా ఉంటే ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల్లో తొలి స్థానంలో నిలిచారు జర్మనీ వైస్ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్. ఆ తర్వాత రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధినేత్రి క్రిస్టీన్ లగార్డ్ నిలిచారు. మూడో స్థానంలో అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ నిలిచారు.ఇక బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 29వ స్థానంలో నిలిచారు.

2019లో ప్రపంచవ్యాప్తంగా పలువురు మహిళలు పలు రంగాల్లో ఉన్నతస్థానాలను అధిష్టించారు. ఇందులో ప్రభుత్వంలో నాయకత్వం, పారిశ్రామికరంగం, దాతృత్వం, మీడియా రంగాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచారని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు జాబితాలో చోటు దక్కడం. నిర్మలా సీతారామన్‌కు 34వ స్థానం దక్కింది. దేశ తొలి ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె కీలకమైన రక్షణశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. నిర్మలా సీతారామన్‌ కంటే ముందుగా ఆర్థికశాఖను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టారు. అయితే అది కొంతకాలం వరకే కాగా నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయిలో ఆర్థికశాఖ పోర్ట్‌ఫోలియోను నిర్వర్తించారు.

Nirmala sitharaman makes it in Forbes worlds most Powerful women list

ఇక హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ నాడార్ మల్హోత్ర ఫోర్బ్స్ జాబితాలో 54వ స్థానం సంపాదించారు.8.9 బిలియన్ అమెరికా డాలర్లు టర్నోవర్ ఉన్న టెక్నాలజీ కంపెనీకి వ్యూహకర్తగా లేదా స్ట్రాటిజిక్ డెసిషన్స్ తీసుకునే బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తున్నారు. మరోవైపు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఫోర్బ్స్ జాబితాలో 65వ స్థానం దక్కించుకున్నారు. 1978లో ప్రారంభమైన బయోకాన్ సంస్థ అనతి కాలంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్‌లు ముందుకు వచ్చారు. అంతేకాదు క్యాన్సర్ చికిత్సకు మందు కనుగొనడంతో USFDAచే గుర్తింపు పొందిన తొలి సంస్థ బయోకాన్.

ఇదిలా ఉంటే ఫోర్బ్స్ జాబితాలో బిల్ & మెలిండా ఫౌండేషన్ మెలిండా గేట్స్ ఆరవ స్థానం పొందగా, ఐబీఎం సీఈఓ గిన్నీ రొమెట్టీ 9వ స్థానం, ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ 18 వస్థానం, న్యూజిలాండ్ ప్రధాని జేసిండా అర్డెన్ 38వ స్థానం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సలహాదారు ఇవాంకా ట్రంప్‌ 42వ స్థానం సింగర్లు రిహన్నా 61వ స్థానం, బియాన్స్ 66వ స్థానం టేలర్ స్విఫ్ట్‌ 71వ స్థానం, టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ 81వ స్థానం, టీనేజ్ క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రేటా థన్‌బర్గ్ 100వ స్థానంలో నిలిచారు.

English summary
Nirmala Sitharaman, a newcomer on the Forbes most powerful women list, is ranked 34th. India's first female finance minister, Sitharaman has also served as the country's defence minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X