చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Reserve Bank of Kailasa: నిత్యానందస్వామి దెబ్బ, సేమ్ వాటికన్ బ్యాంకు టైప్, దేవుడా !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ బెంగళూరు/ చెన్నై: అత్యాచారం, కిడ్నాప్ కేసులు ఎదుర్కొంటున్న నిత్యానందస్వామి అలియాస్ నిత్యానంద అనుకున్నది సాధించాను అంటున్నారు. వినాయక చవితి రోజు కైలాసం దేశానికి కొత్త రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీ, కొత్త చట్టాలు ప్రారంభిస్తానని ఇన్ని రోజులు చెప్పిన నిత్యానంద చివరికి అదే వినాయక చవితి రోజున కైలాస దేశంకు కోసం Reserve Bank of Kailasa స్థాపించానని ప్రకటించేశారు. మొత్తం మీద అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటు దేశం విడిచిపారిపోయిన నిత్యానందస్వామి కైలాసదేశం ప్రకటించడమే కాకుండా ఆదేశానికి కొత్త రిజర్వు బ్యాంకు. చట్టాలు, కొత్త కరెన్సీ సృష్టించడం ఎలా సాధ్యం అయ్యింది అనే ప్రశ్నకు ఆ దేవుడే సమాధానం చెప్పాలి అంటున్నారు ప్రజలు.

Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !

 2020 వినాయక చవితి ఇలాగే !

2020 వినాయక చవితి ఇలాగే !

కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు భారతదేశంలో ఇళ్లలోనే వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రజలకు మనవి చేశాయి. దేశంలో దాదాపు 99 శాతం ఎక్కడా రోడ్ల మీద వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించలేదని స్పష్టంగా కనపడుతోంది. 2020 వినాయక చవితి పండుగ ఇళ్లకే పరిమితం అయ్యింది.

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసా

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద గుట్టుచప్పుడు కాకుండా భారతదేశం విడిచిపారిపోయారని పోలీసులు అంటున్నారు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలోని ఈక్విడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో మకాం వేసిన నిత్యానందస్వామి వినాయక చవితి రోజు ప్రపంచానికి షాక్ ఇచ్చారు. నిత్యానందస్వామితో పాటు ఆయన అనుచరులు శనివారం వినాయక చవితి సందర్బంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాసాని నిత్యానందస్వామి స్థాపించారు. అందులో కైలాసదేశం ప్రధాన మంత్రి పదవి గురించి ప్రస్తావించిన నిత్యానంద అందర్నీ ఆచ్చర్యానికి గురిచేస్తున్నారు.

 కైలాసం ఎక్కడుంది దేవుడా !

కైలాసం ఎక్కడుంది దేవుడా !

అసలు కైలాసదేశం ఎక్కడ ఉంది అనే విషయం నిత్యానందస్వామితో పాటు ఆయన అనుచరులకు మాత్రమే తెలుసని సమాచారం. ఈక్విడార్ సమీపంలోని ఓ ద్వీపం కొనుగోలు చేసిన నిత్యానంద ఆ ద్వీపానికి కైలాసదేశంగా ప్రకటించుకున్నారు. అయితే మేము నిత్యానందకు కాని, ఆయన అనుచరులకు కాని ఏ ద్వీపం విక్రయించలేదని, కైలాసదేశం గురించి మాకు సమాచారం లేదని ఇప్పటికే ఈక్విడార్ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

నేను హిందూ సంస్కర్తను కాదు

నేను హిందూ సంస్కర్తను కాదు

కైలాసదేశం ప్రకటించుకున్న నిత్యానందస్వామి తాను హిందూ సంస్కర్తను కాదు, పునర్జీవిని అంటూ తాజాగా విడుదల చేసిన వీడియోలో చెప్పారు. అయితే కైలాసదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదని నిత్యానందస్వామి ఆయన శిష్యులకు, అనుచరులకు ఉపదేశం చేస్తున్నారు. హిందూ మతాన్ని నిశ్చయంగా పాటించే వారు వారి హక్కులు కోల్పోవడం వలనే కైలాసదేశం స్థాపించామని, ఇక్కడ మానవత్వం ఉన్న ఎవరికైనా చోటు ఉంటుందని, ఈ దేశంలో ప్రతిఒక్కరికి జ్ఞానోదయం అవుతోందని నిత్యానందస్వామి స్పీచ్ ఇచ్చారు.

సేమ్ వాటికన్ బ్యాంకు అంతే ఫ్రెండ్స్

సేమ్ వాటికన్ బ్యాంకు అంతే ఫ్రెండ్స్

ఇటీవల నిత్యానందస్వామి ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. వినాయక చవితి రోజు తాను కైలాసదేశం కోసం కొత్త రిజర్వు బ్యాంకు, కరెన్నీతో పాటు 300 పేజీల ఆర్థిక విధానాలను విడుదల చేస్తానని చెప్పారు. అనుకున్నట్లే వినాయక చవితి రోజు నిత్యానంద రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాసాను స్థాపించేశారు. వాటికన్ బ్యాంకు తరహాలోనే కైలాసా రిజర్వు బ్యాంకు కార్యకలాపాలు ఉంటాయని, అందులో ఎలాంటి తేడాలు లేవని నిత్యానందస్వామి స్పష్టం చేశారు.

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | Pollution Free Hyderabad | Nithyananda
 అసలు నిత్యానంద ఏం చేస్తున్నారు ?

అసలు నిత్యానంద ఏం చేస్తున్నారు ?

బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలోని ధ్యానపీఠం ఆశ్రమంలో తన మీద నిత్యానందస్వామి అత్యాచారం చేశారని ఓ వివాహిత మహిళ కొన్ని సంవత్సరాల క్రితమే కేసు పెట్టారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందస్వామి కొంతకాలం రామనగర జైల్లో ఉన్నారు. కోర్టులో ఈ కేసులు ఇంకా విచారణలోనే ఉన్నాయి. ఇలాంటి అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద నకిలీ పాస్ పోర్టు ఉపయోగించి దేశం విడిచిపారిపోయారని ఆరోపణలు రావడం తెలిసిందే .ఇలాంటి సమయంలో కైలాసదేశం ప్రకటించుకున్న నిత్యానందస్వామి ఏకంగా కొత్త రిజర్వు బ్యాంకు, కరెన్సీ నోట్లను ప్రకటించుకోవడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిత్యానంద ఏం చేస్తున్నారు ? అనే ప్రశ్నకు సమాధానం చిక్కడం లేదని ప్రజలు అంటున్నారు.

English summary
Nithyananda Swami launches Reserve Bank of Kailasa. Kailasa describes itself as a stateless nation that does not seek new territory. It describes the rape-accused Nithyananda as an "indisputable stalwart" and a divine treasure that needs to be protected by the international community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X