ఇంతలో ఎంత మార్పు నితీశ్.. నాడు చెల్లని మోడీ.. నేడు అవసరమొచ్చింది.. చరిష్మాతోనే..

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అనే సామెత.. రాజకీయాలకు కరెక్టుగా సరిపోతోంది. బీహర్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి సామెత గుర్తుకొచ్చింది. 2010లో బీహర్ సీఎంగా నితీశ్ కుమార్ ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్నారు. అయితే ఆ సమయంలో వారి మధ్య సఖ్యత లేదు. ప్రచారం చేసేందుకు మోడీ వస్తానని అంటే నితీశ్ రానీయలేదు. ఒకవేళ బీజేపీ మోడీ, వరుణ్ గాంధీని ప్రచారం కోసం పంపితే కూటమి నుంచి వైదొలుగుతానని నితీశ్ బెదిరించారు. కట్ చేస్తే 2020.. బీహర్ అసెంబ్లీ ఎన్నికలు.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

అంతేకాదు బీహర్‌లో సుశీల్ కుమార్ మోడీ ఉన్నారు. మరో మోడీ ఎందుకు అని కామెంట్ చేశారు. నితీశ్ కామెంట్లతో అప్పటీ బీజేపీ నాయకత్వం తలొగ్గింది. కానీ ఇప్పుడు మాత్రం సిచుయేషన్ పూర్తిగా మారిపోయింది. మోడీ ప్రధాని కాగా.. ఆయన చరిష్మ కూడా పెరిగిపోయింది. అయితే గత 15 ఏళ్లుగా నితీశ్ కుమార్ అధికారంలో ఉన్నారు. కానీ ఈ సారి ఎందుకో విజయంపై ఆయన మాత్రం విశ్వాసంతో లేరు. తేజస్వీ యాదవ్ ప్రభ పెరగడం.. చిరాగ్ పాశ్వాన్ రాజకీయాలతో నితీశ్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. పదేళ్ల తర్వాత ప్రధాని మోడీపై ఆధారపడ్డారు. ఇటీవల రెండో విడత ప్రచారంలో ఎన్డీఏ, మోడీ అంటూ ప్రచారం చేశారు.

Nitish Kumar is More Dependent on PM Narendra Modi for Votes

దీనిని బట్టి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉంటుందని చెప్పలేం. పదేళ్ల క్రితం వద్దు ఉన్న నితీశ్.. ఇప్పుడు మోడీ చరిష్మతో గెలువాలని అనుకొంటున్నారు. దీంతో సమయం ఎప్పుడూ ఓకేలా ఉండదు. అధికారమే పరామావధి అయిన రాజకీయాల్లో పూటకో తీరు ప్రవర్తిస్తున్నారు. కానీ ఓ సీఎం, పార్టీ అధినేత స్థాయిలో వ్యవహరించడం ఇక్కడ చర్చకు దారితీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+