నితీష్ ‘పల్టీ’ ఆటకు ఫుల్ స్టాప్! బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్!!
బీహార్ రాజకీయాల్లో లెక్కలు తారుమారయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ దాదాపు సగం పూర్తయిన తర్వాత వెలువడుతున్న ట్రెండ్స్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి అత్యంత బలమైన సంకేతాలను ఇస్తున్నాయి. గతంలో అనేకసార్లు మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి మధ్యమధ్యలో పల్టీ కొట్టిఇబ్బందులు సృష్టించిన నితీష్ కుమార్‌కు ఇకపై ఆ అవకాశం లేకుండా పోవచ్చు. తుది ఫలితాలు ప్రస్తుత ట్రెండ్‌ల ప్రకారం వస్తే, నితీష్ కుమార్ బీహార్ రాజకీయాల్లో బీజేపీకి సవాలు విసరడం అసాధ్యం కానుంది.
నితీష్ లేకుండానే బీజేపీ ప్రభుత్వం?
మధ్యాహ్నం 3 గంటల వరకు అందిన ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ కేవలం అతిపెద్ద పార్టీగానే కాకుండా, జేడీయూ లేకుండానే ఎన్డీఏ కూటమిలోని ఇతర మిత్రపక్షాల మద్దతుతో మెజారిటీ మార్కును (122) దాటే దిశగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్ బీజేపీతో బేరసారాలు చేయడం బీహార్‌లో సులభం కాదు. ఎన్నికలకు ముందు, ఫలితాల తర్వాత కూడా సీఎం నితీష్ కుమార్ ఉంటారని బీజేపీ అధిష్ఠానం పదే పదే ప్రకటించినప్పటికీ వాస్తవంగా అధికార సమీకరణం పూర్తిగా జేడీయూ చేతుల నుంచి బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోయినట్లు స్పష్టమవుతోంది.

నితీష్ 'పల్టీమార్'ఛాన్స్ లేదు
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం 243 సీట్లకు గానూ 206 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉంది. జేడీయూను మినహాయిస్తే కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు (బీజేపీ-95, ఎల్‌జేపీ(ఆర్)-20, హెచ్‌ఏఎం-5, ఆర్‌ఎల్‌ఎం-4) కలిసి ఏకంగా 124 స్థానాల ఆధిక్యాన్ని సాధిస్తున్నాయి. ఈ సంఖ్య మెజారిటీ మార్కు (122)ను దాటింది. ఒకవేళ నితీష్ కుమార్ 'పల్టీ' కొట్టి మహాఘటబంధన్‌తో కలిసినా, ఆ కూటమి సీట్లు (జేడీయూ + మహాఘటబంధన్) మెజారిటీ మార్కు (122) కంటే చాలా వెనుకబడి ఉండటం వల్ల ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమవుతుంది.
దీని ద్వారా, బీహార్ రాజకీయాల్లో బీజేపీ స్థానం అత్యంత బలంగా మారిందని, నితీష్ కుమార్ ఇప్పుడు బీజేపీకి ఎదురు నిలబడలేని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications