నితీశ్ కు ఢిల్లీలో కీలక పదవి, బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఫిక్స్..!!
బీహార్ సీఎం నితీశ్ రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బాధ్యతల స్వీకరణకు రంగం సిద్దం చేస్తున్నారు. నితీశ్ తనయుడు కు కీలక పదవి దక్కనుంది. అదే సమయంలో నితీశ్ కు భవిష్యత్ లో కల్పించే బాధ్యతల పైన ఇప్పటికే బీజేపీ నాయకత్వం స్పష్టత ఇచ్చింది. బీహార్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం.. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత నితీశ్ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
బిహార్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీశ్ కుమార్ మరో సారి పార్లమెంట్ లో అడుగు పెడుతున్నారు. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం, బిహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పునకు నాంది పలికింది. రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, నితీశ్ కుమార్ త్వరలోనే బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఏప్రిల్ 13 లేదా 14వ తేదీల్లో ముఖ్యమంత్రి పదవికి అధికారికంగా రాజీనామా సమర్పించనున్నట్లు తెలుస్తోంది. నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తుండటంతో, బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో ప్రధానంగా నిత్యానంద్ రాయ్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, సామ్రాట్ చౌదరి: ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బిహార్ బీజేపీ అధ్యక్షుడు, దిలీప్ కుమార్ జైస్వాల్: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి రేసులో ఉన్నారు.

బీహార్ కొత్త సీఎంగా.. రేసులో
వీరితో పాటు నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ కూడా కేబినెట్‌లో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా నితీశ్ కుమార్ ఒక అరుదైన ఘనతను సాధించారు. భారతదేశంలో శాసనసభ, శాసనమండలి, లోక్‌సభ, రాజ్యసభ.. ఈ నాలుగు సభలలోనూ సభ్యుడిగా ఉన్న అతికొద్ది మంది నాయకుల జాబితాలో నితీశ్ చేరారు.
రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీ వెళ్లిన తర్వాత కూడా నితీశ్ కుమార్ బిహార్ రాజకీయాల్లో తన పట్టును కోల్పోరని ఆయన అనుచరులు చెబుతున్నారు. NDA కూటమిలో కీలక వ్యూహకర్తగా ఆయన జాతీయ స్థాయిలో సేవలందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కోసం ఢిల్లీలో 'టైప్-8' బంగ్లాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో.. నితీశ్ ను తొలుత కేంద్ర మంత్రిగా.. ఆ తరువాత రాజ్యాంగ బద్దమైన పదవి అప్పగిస్తారని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications