విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.12వేలు రావాలంటే.. వెంటనే అప్లై చేయండి
NMMS Scholarship 2025: కేంద్ర సర్కారు ప్రతి ఏటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తున్న విషయం తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలోని లక్ష మంది విద్యార్థులకు ఏటా రూ.12 వేలు ఇస్తారు. 8వ తరగతి తర్వాత విద్యార్థుల డ్రాపౌట్ కాకుండా నివారించి వారిని చదువుకునేందుకు ప్రోత్సహించడమే లక్ష్యం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ విధానంలో ఆగస్టు 31, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 13-15 ఏళ్ల లోపు వయస్సు ఉన్న విద్యార్థులు 8వ క్లాస్‌లో 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. ఈ పథకానికి ఎంపికైన లక్ష మంది విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12 వేలు స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసేవరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇంటర్లోనూ స్కాలర్‌షిప్ కొనసాగాలంటే పదో తరగతిలో 60 శాతం మార్కులు పొందాలి. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకుండా ఉండాలి. అయితే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్ వర్తించదు.

విద్యార్థుల ఎంపిక కోసం రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థుల నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్(NSP) ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో ఆగస్టు 31, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రాత పరీక్షలో ప్రతిభను కనబరిచిన విద్యార్థుల బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ.12 వేల చొప్పున స్కాలర్‌షిప్ జమ చేస్తారు. రెండు పేపర్లలో పేపర్ 1లో మెంటల్ ఏబిలిటి టెస్ట్ 90 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు ఉంటుంది. పేపర్ 2 స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(శాట్) 90 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు ఉంటుంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications