సాధ్యమేనా?: ‘ఇక మధ్యాహ్న భోజనానికి ఆధార్ తప్పనిసరి’
మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న వంటవారు, విద్యార్థులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ.
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మరో కష్టసాధ్యమైన కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అదేంటంటే.. మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న వంటవారు, విద్యార్థులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ. ఇప్పటికీ ఆధార్‌కార్డు లేనివారికి జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించింది.
పాఠశాల విద్యకు సంబంధించిన రాయితీ పథకాలను ఆధార్‌తో అనుసంధానించడానికి కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఉపక్రమించింది.

మధ్యాహ్న భోజన పథకంలో పారదర్శకతకు, సమర్థంగా అమలు చేసేందుకు ఆధార్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ మేరకు పాఠశాలలకు నోటిఫికేషన్ పంపించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వంటవారు/సహాయకులను కూడా లబ్ధిదారులుగానే పరిగణిస్తున్నామని, అందుకే వారు కూడా ఆధార్‌ను చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అయితే, పాఠశాలల్లో చదువుకుంటున్న చిన్నారులకు కూడా ఆధార్ తప్పనిసరి చేయడం పట్ల పలువురు తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. మధ్యాహ్న భోజనం కావాలంటే చిన్నారులు కూడా ఆధార్ కార్డు కోసం తిరుగాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతీ పాఠశాలకు వచ్చి సిబ్బందే ఆధార్ కార్డులను ఇచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications