కేంద్ర బడ్జెట్‌ 2018: ఇటు తగ్గింపు, అటు పెంపు... వాహనదారులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం!

న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గుతాయని భావించేలోపే కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరపై తగ్గే ఆ రూ.2ను సెస్‌కు మళ్లించింది. ఫలితం.. పెట్రోల్, డీజిల్ రేట్లు యథాతధం.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2018-19 సాధారణ వార్షిక బడ్జెట్‌లో ఎంతో కొంత ఊరట కలిగిందని వాహనదారులు సంతోషించారు కానీ, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు.

No change in petrol, diesel prices after budget duty rejig

పెట్రోల్, డీజిల్‌పై రెండు రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే కదా. అయితే ఆ తగ్గించిన మొత్తాన్ని సెస్‌కు మళ్లించినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్లడించారు. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టంచేశారు.

బడ్జెట్‌లో విద్య, ఆరోగ్యంపై ఉన్న సెస్‌ను మూడు నుంచి నాలుగు శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఈ తగ్గిన ఎక్సైజ్ డ్యూటీ అటు పెరిగిన సెస్‌తో సమానమైంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు రాలేదు. 'అమ్మ.. జైట్లీ.. ఎంతపనిచేశావయ్యా..' అని ముక్కున వేలేసుకోవడం తప్ప వాహనదారులు చేయగలిగిందేమీ లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+