'పోరాటంలోకి స్త్రీలొద్దు, ఖైదీగా పట్టుకుంటే ఏంజరుగుతుందో ఆలోచించండి'
పుణే/ముంబై: సైనిక దళాల్లో మహిళలను పోరాట విధుల్లోకి తీసుకోబోమని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శనివారం చెప్పారు. యుద్ధంలో మహిళను ఖైదీగా పట్టుకుంటే ఏం జరుగుతుందో ఆలోచించాలని ఆయన చెప్పారు. సైనిక దళాల్లోని మిగతా క్రియాశీల రంగాల్లోకి మహిళల ప్రవేశాన్ని ప్రోత్సహిస్తామన్నారు.
ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. పోరాట విధుల్లోకి మించి మిగతా వాటిలో మహిళలను ప్రోత్సహిస్తామని, క్రమంగా వారి పాత్రను పెంపొందిస్తామని చెప్పారు.

బీఫ్‌పై నిషేధంతో మతసామరస్యం: షాన్ వాజ్
మహారాష్ట్ర తరహాలో ఇతర రాష్ట్రాల్లోను గొడ్డు మాంసం పైన నిషేధం విధించాలని అక్కడి ముస్లీంలు కోరాలని, బీఫ్ పైన నిషేధం విధించడం ద్వారానే మత సామరస్యాన్ని ప్రోత్సహించినట్లవుతుందని బీజేపీ నేత షాన్ వాజ్ హుస్సేన్ అన్నారు.
బీఫ్ తినాలనుకుంటే పాకిస్తాన్ వెళ్లాలన్న కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యల్లో ఎవరి మనోభావాలనూ గాయపరిచే ఉద్దేశ్యం లేదన్నారు. అయినా మేం చెబితే ఎవరైనా పాకిస్తాన్ వెళ్తారా అని ప్రశ్నించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజల భావోద్వేగాల దృష్ట్యా తమ రాష్ట్రంలో గోమాంసం విక్రయాలను నిషేధించిందన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఇతర రాష్ట్రాల ముస్లీంలు గోమాంసం విక్రయాలను తమ వద్ద కూడా నిషేధించాలని డిమాండ్ చేయాలన్నారు.












Click it and Unblock the Notifications