రద్దయిన రూ.500, రూ.1000 నోట్లపై కేంద్రం కీలక ప్రకటన, టెక్నికల్ కోర్సు‌పై సుప్రీం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల గురించి కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను కలిగి ఉన్న వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలను తీసుకోబోమని సుప్రీం కోర్టుకు తెలిపింది.

పిటిషన్ దాఖలు

పిటిషన్ దాఖలు

సుప్రీం కోర్టు దీనిపై తుది నిర్ణయం ప్రకటించేంత వరకు తాము ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం తెలిపింది. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయని వారిపై సుప్రీం నిర్ణయాన్ని కోరుతూ సుధామిశ్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం శుక్రవారం విచారించింది.

  RBI May stops Rs 2000 notes And focus turns to Rs 200 notes
  గతంలో హెచ్చరించిన కేంద్రం

  గతంలో హెచ్చరించిన కేంద్రం

  ఈ సందర్భంగా కేంద్రం ఈమేరకు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. కాగా, రద్దయిన నోట్లను కలిగి ఉంటే భారీ జరిమానాలు తప్పవని గతంలో కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే.

  టెక్నికల్ కరస్పాండెంట్ కోర్సులపై

  టెక్నికల్ కరస్పాండెంట్ కోర్సులపై

  కరస్పాండెన్స్ విధానంలో టెక్నికల్ కోర్సులను నేర్చుకోవడం చెల్లదని సుప్రీం శుక్రవారం కీలక రూలింగ్ ఇచ్చింది. ఇంజనీరింగ్‌ను దూర విద్యా విధానంలో నేర్చుకోబోలేమని అభిప్రాయపడ్డ సుప్రీం.. గతంలో ఒడిశా హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని పేర్కొంది.

  ఒడిశా హైకోర్టు తీర్పు కొట్టివేసింది

  ఒడిశా హైకోర్టు తీర్పు కొట్టివేసింది

  టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను దూర విద్య ద్వారా నేర్చుకోవచ్చని ఒడిశా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో దూరవిద్యా విధానంలో సాంకేతిక కోర్సులను అనుమతించ వచ్చని పంజాబ్ హర్యానా కోర్టు చేసిన వ్యాఖ్యలనూ తప్పుబట్టింది.

  ఎలా నేర్చుకోవచ్చో తెలియడం లేదు

  ఎలా నేర్చుకోవచ్చో తెలియడం లేదు

  కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో ఎలా నేర్చుకోవచ్చో తెలియడం లేదని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. సాంకేతికతతో కూడిన కోర్సులు, రెగ్యులర్ క్లాసులకు హాజరు కాకుండా, ప్రాక్టికల్స్ చేయకుండా కేవలం చదువుకుని నేర్చుకునే విద్యలు కాదని పేర్కొంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Centre on Friday told the Supreme Court that no criminal action would be taken against those petitioners who were holding old currency notes of Rs 500 and Rs 1000.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి