"కోటీ 30 లక్షల హిందూ ఓటర్ల గల్లంతు"- యోగీ ఆరోపణపై తేల్చేసిన ఈసీ..!

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తర్ ప్రదేశ్ లో (UP) తాజాగా నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ లో ఏకంగా కోటీ 30 లక్షల హిందువుల ఓట్లు గల్లంతైనట్లు సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేసిన ఆరోపణ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బీజేపీ నేతలు ముస్లింల ఓట్లను, తమకు నచ్చని ఇతర వర్గాల ఓట్లను, ప్రతిపక్షాల ఓట్లను ఈసీ సాయంతో ఎస్ఐఆర్ లో తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో యోగీ ఈ ఆరోపణలు చేశారు. దీనిపై ఇవాళ యూపీ ఎన్నికల అధికారి క్లారిటీ ఇచ్చారు.

యూపీలో నిర్వహించిన ఎస్ఐఆర్ సందర్భంగా కోటీ 30 లక్షల మంది హిందువుల ఓట్లు గల్లంతైనట్లు యోగీ ఆదిత్యనాథ్ చేసిన ఆరోపణను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నవదీప్ రిన్వా తోసిపుచ్చారు. రాష్ట్ర ఓటరు జాబితాల్లో మతాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఓటర్ల వివరాలను వర్గీకరించడం లేదా నమోదు చేయడం జరగదని ఆయన తేల్చిచెప్పేశారు. అధికారిక ఓటరు రికార్డులలో కేవలం ఓటరు పేరు, లింగం, జీవిత భాగస్వామి పేరు వంటి ప్రాథమిక జనాభా వివరాలు మాత్రమే ఉంటాయని, మతపరమైన వివరాలను ఎక్కడా నమోదు చేయరని రిన్వా వివరించారు.

No Data Based on Religion UP Poll Officer Rejects Yogi s Claim of 1 27 Crore Missing Hindu Voters

తమ ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే, అందులో ఓటరు పేరు, లింగం, వారి జీవిత భాగస్వామి పేరు మాత్రమే ఉంటాయని ఆయన తెలిపారు. హిందువులా లేదా ముస్లింలా అనే మతపరమైన వివరాలను తాము నమోదు చేయబోమన్నారు. మతం ఆధారంగా మేము డేటాను వర్గీకరించడం గానీ, విశ్లేషించడం గానీ చేయబోమన్నారు. యోగీ చెప్పిన మొత్తం 1.27 కోట్ల సంఖ్యను వివరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుతున్న 55 లక్షల మంది హిందూ లబ్ధిదారుల పేర్లు, అలాగే 18, 19 ఏళ్ల వయస్సు గల సుమారు 4.5 లక్షల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో లేవని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ఓటర్ల తొలగింపుపై యోగి ఆదిత్యనాథ్ వదంతులు వ్యాప్తి చేస్తున్నారని యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+