భార్య అంగీకరించినా విడాకులు కుదరవు: సుప్రీం
న్యూఢిల్లీ: ఓ విడాకుల కేసులో సుప్రీంకోర్టు సంచనలన తీర్పును వెలువరించింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. రూ. 12.5 లక్షలు భరణంగా తీసుకునే ఒప్పందం ప్రకారం భార్య కూడా విడాకులకు అంగీకరించింది.
అయితే, కోర్టు మాత్రం విడాకులు మంజూరు చేయడం కుదరదని స్పష్టం చేసిందేి. హిందూ వివాహ వ్యవస్థలో భార్య తన భర్తను దైవంలా భావిస్తుందని, తనకు సంబంధించిన అందరినీ వదలేసి భర్త కుటుంబాన్నే తన కుటుంబంగా స్వీకరించి, బిడ్డలకు జన్మనిచ్చి భర్త కోసమే నిస్వార్థంగా జీవిస్తుందని కోర్టు వివరించింది.

ఆ వివరణ ఇస్తూ - ఆటువంటి భార్యకు అనారోగ్య సమయంలో విడాకులు మంజూరు చేయడం ఆమె అంగికరించినా సరే కుదరదని ఎంవై ఇక్బాల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు చెప్పింది. ముందుగా చికిత్సకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలిపిన కోర్టు పూర్తిగా కోలుకున్న తర్వాతనే విడాకుల అంశాన్ని పరిశీలిస్తామని తేల్చి చెప్పింది.
ఆమె జీవితాన్ని, ప్రేమను మాత్రమే కాకుండా విషాదాలను, సమస్యలను పంచుకోవడమే కాకుండా తన భర్త జీవితంలో, కార్యకలాపాల్లో విడదీయరాని భాగంగా మారిపోతుందని కూడా వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications