ఉప్పెనలా కరోనా కేసులు పెరుగుతున్నా మాస్కులేవి? ఈ వేరియంట్ సకల కళా వల్లభన్!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇంతగా కరోనా కేసులు పెరుగుతున్నా జనాలలో మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉంది. మాస్కులు పెట్టుకుని తిరిగేవారు కానీ, సామాజిక దూరం పాటించేవారు కానీ కనిపించడం లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే కరోనా అంటే కాస్త భయం తగ్గినట్టుగా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది.

కరోనా కొత్త వేరియంట్ .. రోజుకో లక్షణం
ఒక పక్కన కరోనా వ్యాప్తి జరుగుతుంది అని తెలిసిన యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యికి పైగా నమోదు అయినట్టుగా కేంద్ర గణాంకాలు చెబుతున్నా పట్టించుకున్న నాధుడు లేడు.
ప్రస్తుతం కరోనా వేరియంట్లు రోజుకో కొత్త లక్షణంతో ఇబ్బంది పెడుతున్నాయని సింగర్ స్మిత తల్లి వి. జోగులాంబ తెలిపారు. ఆమె ప్రస్తుత కరోనా వేరియంట్ పైన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

no fear in public with corona but beware of new variant is lot of problems this is latest corona situation

Take a Poll

కరోనా సోకాక రోజుకో లక్షణం
తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. తాను మూడు సార్లు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తనకు మళ్లీ కరోనా సోకిందని, వైరస్ బారిన పడిన తొలి రోజు జ్వరం వచ్చిందని, రెండవ రోజు తలనొప్పి, మూడవరోజు గొంతు నొప్పి, నాలుగవ రోజు జలుబు, ఐదవ రోజు కడుపునొప్పితో తాను ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు.

సకలకళా వల్లభన్ లా కరోనా కొత్త వేరియంట్
ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా వేరియంట్ రోజుకు ఒక కొత్త లక్షణంతో సకలకళా వల్లభన్ లా ఉందని పైగా ఇది విపరీతమైన బలహీనతను మిగిల్చి మన శరీరాన్ని వదిలిపెట్టి వెళుతుందని పేర్కొన్నారు. ఆ బలహీనత నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుందని చెబుతూ, ఎవరికివారు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

దేశంలో భారీ కేసులు
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా భారీగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత వారం రోజుల వ్యవధిలోనే 750 మంది కరోనా బారిన పడ్డట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఈ రాష్ట్రాలలో అధిక కేసులు
ఇక దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. కేంద్రం నిన్న విడుదల చేసిన గణాంకాల ప్రకారం కేరళ రాష్ట్రంలో 335 కొత్త కేసులు నమోదయ్యాయి కేరళలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 430 కి చేరుకుంది. ఇక మహారాష్ట్రలో 153 కరోనా కొత్త కేసులు, ఢిల్లీలో 99 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటికి మహారాష్ట్రలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరుకుంది. ఇక ఢిల్లీలో 104కి పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+