వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిలకు సొంతవాళ్ల నుంచి షాక్: దీక్ష ఖర్చు భారీగానే

|
Google Oneindia TeluguNews

ఇంఫాల్: 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసిన ఇరోమ్ షర్మిలకు చుక్కెదురైంది. ఆమెకు స్థానికుల నుంచి షాక్ తగిలింది. ఏ ప్రజలు అయితే ఆమెను ఇన్నాళ్లు ఉక్కు మహిళగా పొగడ్తలు కురిపించారో.. ఇప్పుడు అదే ప్రజల నుంచి ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఆమె దీక్షను నిలిపివేయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీక్ష విరమణ అనంతరం పదహారేళ్లుగా తానున్న ఆసుపత్రికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్నేహితురాలితో కలిసి ఉండాలని షర్మిల నిర్ణయించుకున్నారు. కానీ ఆ ప్రాంతానికి కూడా ఆమె వెళ్లలేకపోయారు.

అందుకు కారణం, ఆమెకు స్థానికుల నుంచి నిరసనలు రావడమే. సమీపంలోని ఇస్కాన్ దేవాలయాన్ని సంప్రదిస్తే వారు సైతే షర్మిలకు ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆమె తిరిగి తాను ఇన్నాళ్లు ఉన్న ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను పోరాటాన్ని వదలలేదని, మార్గాన్ని మాత్రమే మార్చుకున్నానని చెప్పారు.

 ఇరోమ్ షర్మిల

ఇరోమ్ షర్మిల

సుదీర్ఘకాలం ఇరోమ్ షర్మిల నిరహార దీక్ష చేపట్టిన కాలంలో ఆమెకు అయిన వైద్యం ఖర్చు తడిసి మోపడైంది. సైనిక దళాలకు (స్పెషల్ పవర్స్) వ్యతిరేకంగా పదహారేళ్ల పాటు చేపట్టిన దీక్ష కాలంలో ఆమెకు ముక్కుకు పైపును అమర్చి పుష్టికరమైన పోషకాలను అందించారు.

ఇరోమ్ షర్మిల

ఇరోమ్ షర్మిల


షర్మిల ఆరోగ్య పరిస్థితి విషమించకుండా ప్రత్యేకంగా విటమిన్లు, మినరల్స్, బలవర్ధకమైన ఆహార పదార్థాలను ద్రవ రూపంలో ఆమె దేహంలోకి బలవంతంగా ఎక్కించారు. ఇందుకోసం మణిపూర్ ప్రభుత్వం ప్రతినెల రూ.10 వేల రూపాయలను ఖర్చు చేసింది.

 ఇరోమ్ షర్మిల

ఇరోమ్ షర్మిల

ఇంఫాల్‌కు సమీపంలోని మలోమ్ గ్రామంలో అస్సాం రైఫిల్‌కు చెందిన సిబ్బంది 10 మందిని చంపిన ఘటన తర్వాత ఇరోం షర్మిల 2000 నవంబర్ 2 తేదీన నిరాహార దీక్ష చేపట్టారు. సగటు సంపన్న భారతీయుడికి కూడా అందని విధంగా దీక్ష కాలంలో ఆమెకు మంచి ఆహారం అందింది.

ఇరోమ్ షర్మిల

ఇరోమ్ షర్మిల

శరీరానికి అవసరమైన కాల్షియం, కొవ్వు, పిండి పదార్థాలను రోజుకు మూడుసార్లు అందించారు. బరువు కోల్పోకుండా, పెరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే క్రమం తప్పకుండా రక్త, మూత్ర పరీక్షలు, హృదయ స్పందన రేటు తెలుసుకోవడానికి ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.

ఇరోమ్ షర్మిల

ఇరోమ్ షర్మిల

వైద్యులు అందించే ఆహారం కాకుండా ప్రతిరోజు నాలుగు గంటలపాటు యోగా, ఇతర వ్యాయామాలు కూడా చేసేవారు. మంగళవారం దీక్ష విరమించేంతవరకు ఆమెకు తక్కువలో తక్కువ ఐదుగురు జేనిమ్స్ వైద్యులు, 12 మంది నర్సులు, ముగ్గురు మహిళా పోలీసులు, ఇంఫాల్ జైలుకు సంబంధించిన ఇద్దరు మెడికల్ సూపర్‌వైజర్లు, మరికొంత మంది భద్రతా సిబ్బందితోపాటు మొత్తం 40 మంది సేవలందించారు.

English summary
Manipur's Iron Lady, Irom Sharmila, has stopped her fast. And her people find that hard to digest. Offered a home with a friend - 4 kms from her hospital -- the 44 year-old found the gates of the locality barred. Even the local ISKCON temple did not offer her a place to stay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X