వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగం కట్

|
Google Oneindia TeluguNews

జనాభా పెరుగుదల అరికట్టేందుకు దేశంలో ఇప్పటికే పలు నిబంధనలతోపాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలకు ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాంటే ఇద్దరు సంతానమే ఉండాలని నిబంధన తీసుకువచ్చారు. అయితే తాజాగా అసోం ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు కూడ తీసుకుస్తుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటిస్తూ అసోం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిబంధన 2021 నుండి అమల్లోకి తీసుకురానుంది.

అసోం లో కూడ కశ్మీర్ తరహా నిబంధనలు... ప్రొటెక్టెడ్ ఏరియాగా అసోం అసోం లో కూడ కశ్మీర్ తరహా నిబంధనలు... ప్రొటెక్టెడ్ ఏరియాగా అసోం

చైనాను మించనున్న దేశ జనాభ

చైనాను మించనున్న దేశ జనాభ

దేశ జనాభా పెరుగుదల దేశ ఆర్ధిక పరిస్థితిపై విపరీత ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే..దీంతో నిరుద్యోగితపై ప్రధాన ప్రభావం చూపిస్తోంది. దీంతో జనాభ పెరుగుదలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రంతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టాయి. దీంతో జనాభా పెరుగుదలను అడ్డుకునేందుకు పలు ప్రోత్సహాకాలను కూడ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అయినా మరో దశాబ్దంలో ప్రపంచలోనే అధిక జనాభగల దేశంగా భారత దేశం రికార్డులకెక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

జనాభా నియంత్రణకు కేబినెట్ నిర్ణయాలు

జనాభా నియంత్రణకు కేబినెట్ నిర్ణయాలు

ఈ నేపథ్యంలోనే ఈశాన్య రాష్ట్రమైన ఆసోం జనభా పెరుగుదలను అరికట్టేందుకు పలు నిబంధనలు తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఆరాష్ట్ర కేబినేట్ సమావేశం అయింది. రానున్న 2021వ సంవత్సరం నుండి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకునే వారిని జనాభ పెరుగుదల సిద్దాంతలోకి తీసుకువచ్చింది. ఇద్దరు సంతానం కంటే ఎక్కువగా ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యగంలో అనుమతి లేకుండా నిబంధనలు తీసుకురానుంది. దీంతో పలు పాటు పేదరిక నిర్మూలన కోసం పలు నిర్ణయాలను కూడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇటివలే ఎన్‌ఆర్‌సీ తీసుకువచ్చిన అసోం

ఇటివలే ఎన్‌ఆర్‌సీ తీసుకువచ్చిన అసోం

ఇక ఇటివల అసోం ఎన్ఆర్‌సీ నివేదిక తీసుకురావడంతో రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది ధరఖాస్తు చేసుకున్నారు. అందులో 9 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. అంటే రాష్ట్ర జనాభా ఇప్పటికే మూడు కోట్లు దాటింది. దీంతో వారందరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందించడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారనున్న నేపథ్యంలో జనాభా నియంత్రణ చర్యలు చేపట్టింది.

English summary
No govt. jobs in Assam for people with more than two children,the assam cabinet decided to make government jobs out of bounds for people with more than two children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X