భారత్- పాకిస్థాన్ యుద్ధం లైవ్ కవరేజ్ బ్యాన్: కేంద్రం సంచలన నిర్ణయం
పహల్గాం ఉగ్రదాడితో ఇప్పుడు పాకిస్థాన్- భారత్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత ప్రభుత్వం ఉంది. సరిహద్దుల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యుద్దం లైవ్ కవరేజ్ బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా ఛానెల్స్ ఇతర మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

" దేశ మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన కవరేజ్ ను నిలిపేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రత దృష్ట్యా.. అన్ని మీడియా ప్లాట్ ఫార్మ్ లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన వివరాలను రక్షించాల్సిన అవసరం ఉంది" అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో రెండు పేజీల లేఖను పోస్ట్ చేసింది.
Ministry of Information and Broadcasting issues advisory to all Media channels to refrain from showing live coverage of defence operations and movement of security forces in the interest of national security. pic.twitter.com/MQjPvlexdr
— Ministry of Information and Broadcasting (@MIB_India) April 26, 2025
కార్గిల్ యుద్ధం, 26/11 ముంబై ఉగ్ర దాడులు, కాందహార్ హైజాక్ విషయంలో లైవ్ కవరేజీ కారణంగా కొన్ని వ్యూహాత్మక, దౌత్య పరమైన విషయాల్లో వెనక్కు తగ్గాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం గుర్తుచేసింది. రక్షణశాఖ చర్యలకు సంబంధించిన లైవ్ రిపోర్టింగ్, ఫొటొల చిత్రీకరణ, అప్డేట్స్ అన్నీ నిషేధం అని తేల్చి చెప్పింది. కేవలం ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం మాత్రమే విషయాలను ప్రసారం చేయాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications