బిపర్‌జాయ్ కల్లోలం: ప్రాణ నష్టం లేదు కానీ, వేలాది చెట్లు, వందలాది ఇళ్లు ధ్వంసం
గాంధీనగర్: బిపార్జోయ్ తుపాను గుజరాత్ రాష్ట్రంలో కల్లోలం సృష్టించింది. గురువారం రాత్రి ఈ తుపాను గుజరాత్ తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. భీకర గాలులు, భారీ వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో తీరం దాటిన ఈ తుపాను ప్రభావంతో దాదాపు వెయ్యి చెట్లు కూలిపోయాయి. 500కుపైగా ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
భీకర ఈదురుగాలు, భారీ వర్షాల కారణంగా 1000 గ్రామాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అయితే, ముందు జాగ్రత్తలు తీసుకున్న కారణంగా ఈ పెను తుపాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ అతుల్ కార్వాల్ తెలిపారు. తుపాను తీరం దాటిన కచ్ ప్రాంతంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. తీరాన్ని తాకడానికి ముందే వారు మృతి చెందినట్లు ఆయన చెప్పారు. అయితే, వివిధ ప్రాంతాల్లో 23 మందికి గాయాలైనట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు.

కచ్ జిల్లాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని అతుల్ కార్వాల్ తెలిపారు. దాదాపు 40 శాతం గ్రామాల్లో స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అయితే, తీరం దాటే సమయానికి తుపాను సామర్థ్యం కాస్త తగ్గడంతో నష్టం కొంతమేర తగ్గిందన్నారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సన్నద్ధంగా ఉన్నాయిన తెలిపారు.
తీరం దాటిన బిపార్జోయ్ తుపాను ప్రస్తుతం దక్షిన రాజస్థాన్ మీదుగా ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలతో కొన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడికి పంపించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు, ముంబై, కర్ణాటక, రాజస్థాన్‌లోనూ తమ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అతుల్ వివరించారు.
16/06/2023#Cyclone"BIPARJOY"#Team 5 & 6NDRF
— 6 NDRF VADODARA (@6NDRFVADODARA) June 16, 2023
♦️Restoration work continues in urban and rural areas of #Porbandar #Kutch, #Jamnagar and #DevbhumiDwarka.
#Gujarat@NDRFHQ@collectorpor@CollectorKutch@COLLECTORDWK@CollectorJamngr@ndmaindia@ANI@PIBAhmedabad #NDRF4U pic.twitter.com/g5wDYQq6zn
కాగా, ప్రస్తుతం బిపోర్జాయ్ తుఫాను తూర్పు ఈశాన్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను కారణంగా 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మేర్ జిల్లాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్న క్రమంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications