ఇదీ కథ: గ్యాస్ సబ్సిడీ కోతపై నిజానిజాలు
న్యూఢిల్లీ: వార్షికాదాయం రూ. 10 లక్షల రూపాయలు ఉండి పన్ను చెల్లించే వినియోగదారులకు వంట గ్యాస్‌పై సబ్సిడీని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా 20 లక్షల మంది తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్‌ను మార్కెట్ ధరపై కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం.
* భర్త లేదా భార్య ఆదాయం ఏడాదికి రూ. 10 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే అతను లేదా ఆమె గ్యాస్ సబ్సిడీకి అనర్హులు.
* 2015 ప్రకారం, ఆదాయపు పన్ను వివరాలు సమర్పించిన వారిలో దేశ వ్యాప్తంగా 20 లక్షల మంది రూ. 10 లక్షలు అంతకన్నా అధిక ఆదాయాన్ని చూపారు.
* ప్రస్తుతానికి గ్యాస్ వినియోగదారులకు సొంత హామీతోనే సిలిండర్లను సరఫరా చేస్తారు. జనవరి 1 నుంచి ఆర్థిక లావాదేవీలు పరిశీలనలోకి వస్తాయి.
* ఈ నిర్ణయంతో కేంద్రానికి సంవత్సరానికి గాను రూ. 400 కోట్ల వరకూ మిగులుతుందని అంచనా వేస్తున్నారు.
* 2014-15లో గ్యాస్ సబ్సిడీ నిమిత్తం కేంద్రం రూ. 40,551 కోట్లను ఖర్చు పెట్టింది.

* ఈ ఏడాది క్రూడాయిల్ ధరలు తగ్గడంతో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలానికి రూ. 8,814 కోట్లకు తగ్గింది.
* ప్రస్తుతం గ్యాస్ సబ్సిడీ లబ్ధిదారుడికి ఏడాదికి గాను 14.2 కిలోల బరువున్న 12 సిలిండర్లు సబ్సిడీపై రూ. 419.26కు లభిస్తున్నాయి.
* అంతర్జాతీయంగా చమురు ధరల పతనమవడంతో సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్ల ధరలో భారీగా వ్యత్యాసం తగ్గింది.
* ప్రస్తుతం సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 608 మాత్రమే.
* ఇండియాలో 16.35 కోట్ల కనెక్షన్లు ఉండగా, అందులో 14.78 కోట్ల కనెక్షన్లు సబ్సిడీపైనే నడుస్తున్నాయి.
* ప్రధాని 'గివ్ ఇట్ అప్' నినాదంతో ఈ మధ్య కాలంలో 57.50 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు తమకు సబ్సిడీని వదులుకున్నారు.
* సబ్సిడీ బిల్లు తగ్గడం వల్ల ద్రవ్యలోటు దిగివస్తుంది. దీని వల్ల సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించేందుకు వీలు కలుగుతుంది.












Click it and Unblock the Notifications