Piped gas వినియోగదారులకు కేంద్రం కీలక సూచన..! తక్షణం అలా చేయండి..!
ఇరాన్ యుద్దం వేళ దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత తప్పదన్న ముందస్తు భయాల నేపథ్యంలో ఎల్పీజీ సిలెండర్లకు కృత్రిమ కొరత ఏర్పడింది. ఈ సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. ఓవైపు కేంద్రం ఎల్బీజీ ఉత్పత్తి పెంచుతున్నా ప్రజల్లో నెలకున్న భయాలతో గ్యాస్ సిలెండర్లు లభించని పరిస్ధితి వచ్చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం వీలైనన్ని మార్గాల్ని వెతుకుతోంది. ఇందులో భాగంగా పైప్డ్ గ్యాస్ (piped gas) కనెక్షన్లు ఉన్న వారికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్నప్పటికీ గృహ ఎల్పీజీ కనెక్షన్ ఉన్న ఏ వ్యక్తి కూడా దాన్ని కలిగి ఉండొద్దని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏదైనా ప్రభుత్వ చమురు కంపెనీ నుండి లేదా వారి పంపిణీదారుల ద్వారా డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ల రీఫిల్స్ తీసుకోకూడదని సూచించింది. ఇలా రెండు కనెక్షన్లు ఉన్న వ్యక్తులు వెంటనే తమ డొమెస్టిక్ ఎల్‌పిజి కనెక్షన్‌ను అప్పగించాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులో పేర్కొంది.

"No person having a Piped Natural Gas connection and also having domestic LPG connection shall retain a domestic LPG connection, or take refills of domestic LPG cylinders from any Government oil company, or through their distributors. Such persons will be required to immediately… pic.twitter.com/TgSMHzfD7F
— Press Trust of India (@PTI_News) March 14, 2026
దేశవ్యాప్తంగా తీర ప్రాంత రాష్ట్రాల్లో చాలా ఏళ్లుగా పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. రిలయన్స్ కు చెందిన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తో పాటు పలు సంస్థలు ఇలా గ్యాస్ ను సముద్రం ద్వారా నేరుగా ఇళ్లకే సరఫరా చేస్తున్నాయి. అయినా వీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే బ్యాకప్ కోసం ఇంకా ప్రజలు ఎల్పీజీ సిలెండర్లను, కనెక్షన్లను వాడుతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నేపథ్యంలో పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారు కూడా ఎల్బీజీ సిలెండర్లను స్టాక్ పెట్టుకుంటున్నారు. అలాంటి వారిని నియంత్రించేందుకు కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
గ్యాస్ సిలిండర్ బరువు తగ్గింపు? 10 కిలోల ప్లాన్‌తో సామాన్యులకు ఊరట -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
1970ల నాటి చీకటి రోజులు మళ్లీ: సంచలన హెచ్చరిక! -
Women's Reservation Act: మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం రెడీ..! త్వరలో..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!














Click it and Unblock the Notifications