తెలిసొచ్చింది: జనతా దర్బార్‌కు కేజ్రీవాల్ స్వస్తి
న్యూఢిల్లీ: అదిలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వాస్తవం అనుభవంలోకి వచ్చినట్లుంది. జనతా దర్బార్ నిర్వహించి ఆయన చేతులు కాల్చుకున్నట్లే కనిపిస్తున్నారు ఇక ముందు జనతా దర్బార్‌లు ఏర్పాటు చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు.

ఇక ముందు జనతా దర్బార్‌లు ఉండవని, దానికి బదులు వారానికి ఓసారి తాను ప్రజలను కలుస్తానని ఆయన సోమవారం ప్రకటించారు. ఈ సమావేశంలో ఫిర్యాదులను తీసుకుంటానని ఆయన చెప్పారు. తమ సమస్యలను ఆన్‌లైన్ ద్వారా లేదా ఫోన్ల ద్వారా తెలియజేయాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను కోరింది.
శనివారం ఏర్పాటు చేసిన జనతా దర్బార్ సందర్భంగా తీవ్రమైన గందరగోళం చోటు చేసుకుని, తొక్కిసలాట వంటి వాతావరణం చోటు చేసుకుంది. దీంతో కేజ్రీవాల్ మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
జనతా దర్బార్‌కు పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు. వారిని అదుపు చేయడం కూడా కష్టంగా మారింది. జనతా దర్బార్‌పై ఒకప్పటి కేజ్రీవాల్ మిత్రురాలు కిరణ్ బేడీ విరుచుకుపడ్డారు కూడా. అది అనుభవ రాహిత్యాన్ని తెలియజేస్తోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications