బీజేపీకి షాకిచ్చిన నవీన్ పట్నాయక్
బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్.. బీజేపీకి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. సోమవారం తన పార్టీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలతో నవీన్ పట్నయక్ సమావేశమయ్యారు. జూన్ 27న ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ఎగువ సభలో "శక్తివంతమైన, బలమైన" ప్రతిపక్షంగా ఎదగాలని మార్గనిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను తగిన రీతిలో లేవనెత్తాలని చట్టసభ సభ్యులకు సూచించారు నవీన్ పట్నాయక్. ఇక, బీజేపీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడారు రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు సస్మిత్ పాత్ర.

'ఈసారి బీజేడీ ఎంపీలు సమస్యలపై మాట్లాడటానికే పరిమితం కాకుండా, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒడిశా ప్రయోజనాలను విస్మరిస్తే ఆందోళనకు దిగాలని నిర్ణయించుకున్నారు' అని సస్మిత పాత్ర తెలిపారు.
రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని, పార్లమెంటులో రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడాలని నవీన్ పట్నాయక్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని పాత్రా చెప్పారు. కాగా, గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అవసరమైన సమయంలో బీజేడీ మద్దతు ఇస్తూ వచ్చింది. కానీ, ఈసారి మాత్రం అలా చేయొద్దని నిర్ణయించడం గమనార్హం.
బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి సమస్య ఆధారిత మద్దతు ఇవ్వడంలో బీజేడీ తన మునుపటి వైఖరిని కొనసాగిస్తుందా? అని అడిగినప్పుడు.. "ఇకపై బీజేపీకి మద్దతు లేదు, ప్రతిపక్షంగా మాత్రమే. ఒడిశా ప్రయోజనాలను కాపాడటానికి మేము ఎంతకైనా వెళ్ళవచ్చు' అని ఆయన అన్నారు. ఒడిశాకు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తామని, వాటిని నెరవేర్చుకునేందుకు పోరాటం చేస్తామని తెలిపారు.
బొగ్గు రాయల్టీలో సవరణ చేయాలన్న ఒడిశా డిమాండ్‌ను గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, దీంతో రాష్ట్రం నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజల వాటా దక్కకుండా పోతోందన్నారు. రాజ్యసభలో 9 మంది ఎంపీలు బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని సస్మిత పాత్ర తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో దశాబ్దాలుగా పాలిస్తున్న బీజేడీ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications