మహాత్మా గాంధీ హత్య కేసులో మళ్లీ దర్యాఫ్తు అవసరం లేదు'

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ హత్య కేసును తిరిగి దర్యాఫ్తు చేయాల్సిన అవసరం లేదని ఈ కేసుపై అమికస్ క్యూరీ (న్యాయ సహాయకుడు)గా ఉన్న సీనియర్ న్యాయవాది అమరేందర్ శరణ్ తెలిపారు. ఈ మేరకు తన అభిప్రాయం ఆయన సుప్రీం కోర్టుకు నివేదించారు.

నివేదికను పరిశీలించిన జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. గాంధీజీ హత్య హత్య కుట్రలో మూడో వ్యక్తి ప్రమేయం ఉందంటూ ముంబైకి చెందిన పరిశోధకుడు పంకజ్‌ ఫడ్నవీస్ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

No mysterious person behind killing of Mahatma Gandhi & he was killed by Godse: Amicus to SC

ఈ కేసును మళ్లీ విచారించాలని కోరారు. దీనిపై గతేడాది అక్టోబరులో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ మూడో వ్యక్తి జీవించి ఉన్నాడో లేదో చెప్పాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ కేసులో న్యాయసలహా కోరుతూ అమరేందర్‌ శరణ్‌ను అమికస్‌ క్యూరీగా నియమించింది.

ఈ కేసుపై పరిశోధన చేపట్టిన శరణ్‌ సోమవారం తన నివేదికను ఇచ్చారు. గాంధీజీ శరీరంలో దొరికిన బుల్లెట్లు, అవి కాల్చిన పిస్టోల్‌, హంతకుడు, హత్యకు కుట్ర వీటిని పరిశీలిస్తే ఎలాంటి అనుమానం రావడం లేదని, గాడ్సే కాకుండా మరో వ్యక్తి గాంధీపై కాల్పులు జరిపాడనేదానిపై ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవని, దీనిపై మరోసారి దర్యాప్తు జరపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Senior advocate Amrendra Sharan, who was asked by Supreme Court to examine all documents pertaining to Mahatma Gandhi assassination case to find out whether there was involvement of a 'mysterious' person who had fired fourth bullet which killed father of nation, told the court on Monday that there is no evidence to prove that Mahatma was killed by person other than Nathuram Godse.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X